Transition
-
ఇంధన పరివర్తనపై జాగ్రత్త అవసరం
న్యూఢిల్లీ: ఇంధన పరివర్తన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వృద్ధి విషయంలో రాజీపడకుండా దీన్ని సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘ఇంధన పరివర్తన, వాతావరణ పరిరక్షణ లక్ష్యాల సాధన పేరుతో వృద్ధిని పక్కన పడేయకూడదు. వృద్ధి అనేదే లేకపోతే, పర్యావరణ మార్పులను నియంత్రించడం కోసం పెట్టుబడులు పెట్టేందుకు వనరులు కూడా ఉండవు‘ అని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ విషయాలు వివరించారు. పారిశ్రామిక విద్యుత్ ధరలు ఒక్కసారిగా ఎగిసి యూరప్ ఆర్థికంగా సంకట స్థితిలో పడటానికి .. పునరుత్పాదక విద్యుత్, ఇంధన పరివర్తనపైనే పూర్తిగా దృష్టి పెట్టడం కూడా పాక్షికంగా కారణమన్నారు. ఈ అంశం కేవలం రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా పెద్ద సవాలని, భారత్‌తో పాటు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధికి నోచుకోని దేశాలపైనా ప్రభావం చూపుతోందని నాగేశ్వరన్ చెప్పారు. దేశీయంగా మందగమనం గురించి ఆందోళన చెందనక్కర్లేదని, ఆర్థిక సర్వేలో పేర్కొన్నట్లుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5–7 శాతం వృద్ధిని సాధించే దిశగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. -
ఇంధన పరివర్తన ఇండెక్స్‌లో భారత్ సత్తా.. మెరుగైన ర్యాంక్ సాధన
న్యూఢిల్లీ: ఇంధన పరివర్తన(ఎనర్జీ ట్రాన్సిషన్) ఇండెక్స్‌లో భారత్ 67వ ర్యాంకులో నిలిచినట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) నివేదిక తాజాగా పేర్కొంది. గ్లోబల్ ర్యాంకింగ్స్ జాబితాలో స్వీడన్ తొలి స్థానాన్ని పొందగా.. డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ టాప్–5లో చోటు సాధించాయి. 120 దేశాలతో కూడిన ఈ ఇండెక్స్‌లో అన్ని రకాలుగా ఎనర్జీ ట్రాన్సిషన్‌కు ఊపునిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్ మాత్రమేనని వెల్లడించింది. ఐటీ దిగ్గజం యాక్సెంచర్ సహకారంతో నివేదికను రూపొందించింది. ప్రపంచ ఇంధన సంక్షోభం, భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల కారణంగా ఎనర్జీ ట్రాన్సిషన్ మందగించినప్పటికీ భారత్ చెప్పుకోదగ్గ చర్యలు చేపట్టినట్లు నివేదిక పేర్కొంది. నిరంతర ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న నేపథ్యంలోనూ భారత్ ఇంధన తీవ్రతను తగ్గించుకున్నట్లు తెలియజేసింది. అంతర్జాతీయ ఇంధనాలను పొందడం ద్వారా కర్బనాలకు సైతం చెక్ పెడుతున్నట్లు వెల్లడించింది. అందుబాటులో విద్యుత్ నిర్వహణను సమర్ధవంతంగా చేపడుతున్నట్లు ప్రశంసించింది. శుద్ధ ఇంధనాల వినియోగాన్ని పెంచడం, పునరుత్పాదక ఇంధనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు ఇండెక్స్‌లో భారత్ మెరుగుపడేందుకు దోహదం చేసినట్లు వివరించింది. -
డిశ్చార్జికి.. రీచార్జికి మధ్య ‘ట్రాన్సిషనల్ కేర్’.. కొత్త వైద్యసేవలకు డిమాండ్
నాగేందర్ (55) దిల్సుఖ్నగర్ నివాసి. తీవ్రమైన నరాల వ్యాధికి గురై ఖైరతాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స తర్వాత డిశ్చార్జయి ఇంటికి వెళ్లారు. కానీ నాలుగైదు రోజుల్లోనే సమస్యలు తిరగబెట్టి ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేవల లోపం దీనికి కారణమని వైద్యులు నిర్ధారించారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, వైద్యుల సూచనలను కచ్చితంగా అమలు చేస్తే.. ఈ పరిస్థితి వచ్చేదికాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పటి నుంచి పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ‘ట్రాన్సిషనల్ కేర్’అవసరమని గుర్తించారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థ మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం పాలైన కొందరు రోగులు చికిత్స పొంది, డిశ్చార్జి అయ్యాక తిరిగి ఆస్పత్రుల పాలవుతున్నారు. వైద్యుల సూచనలను సరిగా పాటించలేకనో, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనో.. అనారోగ్య సమస్యను మొదటికి తెచ్చుకుంటున్నారు. చికిత్స తర్వాత జాగ్రత్తలు లోపిస్తే అత్యంత అధునాతనమైన చికిత్స సైతం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రాన్సిషనల్ కేర్ సేవలు పుట్టుకొచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స ముగిసినప్పటి నుంచి పూర్తిస్థాయిలో సాధారణ జీవితాన్ని మొదలుపెట్టేవరకు మధ్యలో అవసరమైన సేవలే ట్రాన్సిషనల్ కేర్. కొందరికి చికిత్స తర్వాత నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ వంటివి అవసరం. వ్యాధి సమస్యల కారణంగా ఎదుర్కొనే మానసిక క్షోభను తగ్గించేందుకు మానసిక పర్యవేక్షణ కావాలి. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్, న్యూరోసైన్స్, కార్డియాలజీకి సంబంధించిన సర్జరీల తర్వాత చికిత్సానంతర సమస్యలను తగ్గించడానికి, పూర్తిగా రికవరీ కావడానికి ట్రాన్సిషనల్ కేర్ మంచి పరిష్కారమని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి వారికి? ఎప్పుడు? ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ప్రతి లక్ష మంది బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో 120కిపైగా మళ్లీ స్ట్రోక్ బారిన పడే చాన్స్ ఉందని అంచనా. వారు డిశ్చార్జి తర్వాతా ఆస్పత్రులకు, ఇంటికి తిరగాల్సి ఉంటుంది. ఈ ప్రయాణ, ఆస్పత్రి ఖర్చుల్ని తగ్గించుకోవడం, జాగ్రత్తల కోసం ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లు ఉపయుక్తమని నిపుణులు చెప్తున్నారు. న్యూరో సర్జరీ, వెన్నెముక గాయాలు, హిప్, మోకాలి మారి్పడి వంటివాటిల్లో చికిత్సానంతరం ఇంటికి వెళ్లేందుకు పట్టే రెండు–మూడు వారాల వ్యవధిలో ప్రత్యేక ట్రాన్సిషనల్ కేర్ అవసరమని వివరిస్తున్నారు. డిశ్చార్జ్ అనంతరం కొందరికి ఫిజియోథెరపీ, మానసిక కౌన్సెలింగ్ వంటివి సుదీర్ఘకాలం చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోగిని ఇంటికి తీసుకెళ్లడానికి బదులుగా కేర్ సెంటర్‌ను ఎంచుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. అల్జీమర్స్ సమస్య ఉన్నవారికీ ట్రాన్సిషనల్ కేర్ అవసరమని అంటున్నారు. ఇక స్వాలో, స్పీచ్ థెరపిస్ట్, మసు్క్యలోస్కెలెటల్ ఫిజియోథెరపిస్ట్ సేవలు, ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావడం, ట్యూబుల ద్వారా ఆహారం అందించాల్సి రావడం, కదలికలకు తోడ్పడే పరికరాలు, మెషీన్లు, కొన్ని రకాల ప్రత్యేక బెడ్లు అవసరం ఉన్నప్పుడు ఈ సేవలను ఎంచుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. కేర్ సెంటర్లు ఏం చేస్తాయి? ట్రాన్సిషనల్ కేర్ సెంటర్లలో వైద్యులు, నర్సులు, ఫిజియోథెరపిస్ట్‌లు, డైటీíÙయన్లు, సైకాలజిస్టులు, ఆక్యుపేషనల్, స్పీచ్, రెస్పిరేటరీ థెరపిస్ట్‌లు, న్యూరో, కార్డియాక్ ఫిజియో థెరపిస్టులు, సైకోథెరపిస్టులు, రోగి పూర్తిగా కోలుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆధునిక సౌకర్యాలు, అనుభవజు్ఞలైన, మల్టీడిసిప్లినరీ రీహ్యాబ్ కేర్ టీమ్ రోగులను పూర్వస్థితికి తీసుకురావడానికి సాయపడుతుంది. రోగి డిశ్చార్జి సమ్మరీని పరిశీలించి, వైద్యులతో మాట్లాడి అవగాహన ఏర్పరుచుకుని, అవసరమైన సేవలను అందిస్తారు. రోగుల పొజిషన్లను మార్చే బెడ్‌సైడ్ అసిస్టెంట్లు, ఆహారాన్ని అందించే నర్సులు కేర్ సెంటర్లో అందుబాటులో ఉంటారు. ఇంటర్నల్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. వ్యయ ప్రయాసలు తగ్గించే క్రమంలో.. దేశంలో 65ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వారికి తరచూ ఆరోగ్య సమస్యలు రావడం, ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం ఎక్కువ. కొందరి విషయంలో ఇంట్లోనే ఉంటే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలోనే ట్రాన్సిషనల్ కేర్ సెంటర్ల అవసరం ఏర్పడింది. సర్జరీ/ ప్రధాన చికిత్స వంటివి జరిగాక.. పూర్తిగా కోలుకోవడానికి ఆస్పత్రిలోనే ఉండటం తీవ్ర వ్యయ భారంతో కూడుకున్నది. అంతేగాకుండా ఇతర రోగులకు చికిత్స అందడంలో ఇబ్బందులు రావచ్చు. అలాంటప్పుడు ఈ సపోర్టివ్ కేర్ సేవలు అందిస్తుంది. – డాక్టర్ రామ్ పాపారావు, చైర్మన్, ఉచ్ఛా్వస్ ట్రాన్సిషనల్ కేర్ చదవండి: డాక్టర్లూ పదండి పల్లెకు పోదాం! -
జీఎస్టీకి లైన్ క్లియర్...ఆ ఒక్కటి తప్ప
న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కార్ ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్టీకి దాదాపు లైన్ క్లియర్ అయింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో15 వ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రులు హాజరైన సమావేశంలో ట్రాన్సిషన్ అండ్ రిటర్న్ సహా పెండింగ్ లో ఉన్న ఇతర అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. జులై 1 నుంచి ఒకే దేశం ఒకే పన్ను (జీఎస్టీ) అమలుకు ఆమోదం లభించింది. దీంతో అన్ని రాష్ట్రాలు జీఎస్టీ డెడ్ లైన్ రడీ అయిపోయినట్టే. అయితే బంగారంపై పన్ను రేటుపై మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది. 5శాతం పన్ను ఖరారు కావచ్చేనే అంచనాలు మాత్రం జోరుగా నెలకొన్నాయి. ఉదయం సెషన్ ముగిసింది. తిరిగి మధ్నాహ్నం 3. గంటలకు తిరిగి కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ భేటీలో బంగారంపై పన్ను రేటు ఖరారు కానుంది. మరికొద్ది సేపట్లో అత్యంతకీలకమైన బంగారంపై జీఎస్టీ పన్నురేటు తేలనుంది. కాగా గత నెలలో జరిగిన కౌన్సిల్ 5, 12, 18, 28 శాతం నాలుగు పన్ను పరిధులను నిర్ణయించిన సంగతి తెలిసిందే. , Delhi: 15th GST council underway at Vigyan Bhawan. Rates of commodities like gold, footwear, textiles, agriculture equipment to be decided. pic.twitter.com/OqDrQxmLBQ — ANI (@ANI_news) June 3, 2017 -
ఆర్థిక శాఖ, ఆర్బీఐ అత్యవసర సమావేశం
న్యూఢిల్లీ: ఏటీఎం సెంటర్లు పనిచేయడం లేదన్న ఆందోళనలపై కేంద్రం స్పందించింది. నగదు తక్షణ కొరత పరిష్కరించే అంశంపై చర్చించి, తగిన చర్యలు చేపట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేడు(శనివారం) సమావేశం కానున్నాయి. ఒకవైపు ఏటీఎం సెంటర్ల దగ్గర బారులు తీరిన ప్రజలు, క్యూ లైన్లలో గంటల తరబడి నిలుచున్నా నిరాశే ఎదురవు తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలపై చర్చించేందుకు ఆర్థికమంత్రిత్వ శాఖ రంగంలో కిదిగింది. సరిపడా కొత్త నోట్ల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ఆందోళన అవసరం లేదని భరోసా ఇస్తోంది. తగినంత కొత్త కరెన్సీ అందుబాటులో ఉన్నప్పటికీ, నిర్వహణ లో సమస్యలు, సమయానికి ఏటీఎంలలో నిల్వ చేయడంలో లోపంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. బ్యాంకు అధికారులకు ఎదురవుతున్న సమస్యలు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు. రూ .3 లక్షల కోట్ల విలువచేసే (1.5 బిలియన్ ) రూ.2 వేల రూపాయల నోట్లకు చలామణికి సిద్ధంగా ఉంచినట్టు, అలాగే మరో 3లక్షలకోట్ల నోట్లను అందుబాటులో ఉంచినట్టు వివరించారు. దీంతోపాటుగా 6 లక్షల అధికారిక రూ .2,000 నోట్లను (3 బిలియన్లు) నెలాఖరు నిల్వతో "తగినంత డబ్బు ఉంది" ఆయన స్పష్టం చేశారు. కాగా పెద్దనోట్ల రద్దుతో ఏటీఎం కేంద్రాలు, బ్యాంకులకు పరుగులు తీస్తున్న ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. బారులుతీరిన లైన్లు, నో సర్వీస్ బోర్డులు దర్శినమిస్తుండడంతో సామాన్య ప్రజల్లో కలకలం మొదలైంది. 40 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అబ్బాయి మారాడు
‘సమాజంలో మార్పు రావాలంటే మహిళల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి. సమాజంలో మార్పు రావాలంటే.. సింపుల్‌గా... అబ్బాయిలు మారాలి’ అని చెబుతూ ‘ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్’ వలంటీర్లు దేశవ్యాప్తంగా చైతన్యం కలిగిస్తున్నారు. అబ్బాయిలలో పరివర్తన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పుటలు పుటలు రాశారు. పుస్తకాలు, గ్రంథాలు ప్రచురించారు. ఉద్యమాలు చేశారు. ఆపసోపాలు పడ్డారు. బ్యానర్లు కట్టారు. నినాదాలు చేశారు. సీన్లు రాశారు. సినిమాలు తీశారు. స్టేజీలు ఎక్కారు. మైకులు మింగారు. సభలకు వెళ్లారు. చట్టాలు తెచ్చారు. అయినా... ‘అబ్బాయి’ మారలేదు. లేదు... లేదు... మారాడు! ‘నీ పేరు?’ ‘అనికేత్’ ‘ఏం చదువుతున్నావ్? ‘ నైన్త్ క్లాస్’ ‘వీళ్లంతా ఎవరు?’ ‘మా ఫ్రెండ్స్!’ ‘ఎందుకలా ఆ ఆడపిల్లల్ని ఆట పట్టిస్తున్నారు?’ ‘ఆడపిల్లలు ఇంటి పట్టున ఉండకుండా అట్లా సైకిళ్లేసుకొని తిరగడమేంటి?’ ‘ఏ! ఎందుకు ఆడుకోవద్దు.. వాళ్లూ మీ వయసువాళ్లేగా?’ ‘కానీ వాళ్లు ఆడపిల్లలు.. ఆడపిల్లలు రోడ్లమీదకు రావడమేంటి?’ ‘రావద్దని ఎవరు చెప్పారు?’ ‘మా అమ్మా, నాన్న. మా ఇంట్లో అయితే అంతే. అమ్మాయిలు బయటకు రారు. మగపిల్లలతో మాట్లాడరు, మాట్లాడొద్దు కూడా!’ కరాఖండిగా చెప్పాడు అనికేత్. ‘నీకు అక్క, చెల్లెళ్లు ఉన్నారా?’ ‘ఊ.. ఒక అక్క, చెల్లెలు’ ‘చదువుకుంటున్నారా?’ ‘చదువా? హె.. హె (వెటకారంగా నవ్వుతూ)’ ‘ఎందుకలా నవ్వుతున్నావ్?’ ‘మరి? మా అక్క ఇంట్లోనే ఉంటుంది.. మాకు వండిపెడుతూ. చెల్లెలు స్కూల్‌కి వెళ్తుంది. కాని పెద్దమనిషి కాగానే మాన్పించేస్తామని అమ్మ చెప్పింది’. ‘ఇంట్లో నువ్వు సాయం చేస్తావా?’ ‘నేనా? ఛీఛీ...’ ‘ఎందుకు ఛీ?’ ‘నేను అబ్బాయిని. అలాంటి పనులు చేయకూడదు. నేనే కాదు మా గల్లీలో, మా ఫ్రెండ్స్ ఇళ్లల్లో, మా చుట్టాల్లో అబ్బాయిలెవరూ ఇలాంటి పనులు చేయరు.. చేయకూడదు. మేం మగవాళ్లం. బయట పనులు చేస్తాం. బోర్ కొడితే సినిమాలకెళ్తాం. ఆడుకుంటాం.. సైకిల్ రేస్ పెట్టుకుంటాం..’ అనికేత్ చెప్తుంటే.. పక్కనే ఉన్న గుంపులో ఒక అబ్బాయి ‘ఆడపిల్లల్ని చిడాయిస్తాం కూడా’ అన్నాడు వెకిలిగా నవ్వుతూ. అతను ఆ మాట అనగానే గుంపు గుంపంతా హై ఫైవ్ ఇచ్చుకున్నారు అదే వెకిలి నవ్వుతో! మూడు నెలల కిందట జరిగిన సంభాషణ ఇది. పుణెలోని ఎగువ, దిగువ మధ్యతరగతి కలగలసి ఉండే ప్రాంతంలోని ఓ మార్కెట్లో! ఒక్క అనికేతే కాదు ఆ మార్కెట్లోని పద్నాలుగు, పదిహేడేళ్ల మధ్య వయసున్న అబ్బాయిలంతా వాళ్లింటి ఆడపిల్లల గురించి దాదాపు ఇలాంటి అభిప్రాయాలే వెలిబుచ్చారు. ఇప్పుడు... అనికేత్ వాళ్లింట్లో... వాళ్లక్క ప్రశాంతి నీళ్ల బిందె మోస్తుంటే ఎదురెళ్లి బిందెను తన భుజం మీదకు తీసుకుంటూ కనిపించాడు అనికేత్. ఆమె చపాతి పిండి తడుపుతుంటే కూరగాయలు తరిగిపెట్టాడు. ఆశ్చర్యపోయి.. ‘అనికేత్ నువ్వేంటి? అమ్మాయిల పని చేస్తున్నావ్? నీ ప్రెస్టేజ్ ఏం కాను?’ అని అడిగితే.. ‘ప్రెస్టేజ్ గిస్టేజ్ జాన్తా నహీ మేడమ్.. లడ్కా యా లడ్కీ దోనో బరాబర్ హై.. సబ్కో సబ్ కామ్ కర్నా చాహియే’ అంటూ అక్కకు హిస్టరీ పుస్తకంలోని పాఠాన్ని వివరించసాగాడు. చపాతీలు చేస్తూనే తమ్ముడు చెప్తున్న పాఠాన్ని శ్రద్ధగా వింటోంది ప్రశాంతి. ‘ఏంటీ అక్కకు చదువు చెప్తున్నావా?’ .. ‘అవును మేడం.. ఈ యేడాది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతోంది ప్రైవేట్‌గానే’- సమాధానమిచ్చాడు. చెల్లెల్నీ మంచిగా చదివించాలని, అందుకు వాళ్ల నాన్న ఒప్పుకోకుంటే తను చదివిస్తానని చెప్పాడు. అక్క, చెల్లెలు ఇంటి పనికే పరిమితం కావాలని, సల్వార్‌కమీజ్ తప్ప ఇంకెలాంటి మోడర్న్ డ్రెస్‌లు వేసుకోకూడదని, మగపిల్లల వంక కన్నెత్తి చూడకూడదనే బలమైన భావాలతో ఉన్న అనికేత్‌లో ఇంతటి మార్పేంటి? కారణం ఎవరు? ఎవరంటే.. ‘ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్’ అనే స్వచ్చంద సంస్థ! దీనిని స్థాపించింది.. రుజుతా తెర్‌దేశాయి. అసలు ఆమెకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ‘స్కూల్, కాలేజ్, సినిమా, షాపింగ్ ఇలా ఎక్కడికి వెళ్లినా అల్లరిమూకల పిచ్చి మాటలు వింటూనే పెరిగాను. ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాను. స్కూల్‌డేస్‌లో, కాలేజ్ డేస్‌లో అబ్బాయిలు ఇలా మాట్లాడుతున్నారు అని ఇంట్లో చెబితే ఒళ్లు కనపడని బట్టలు వేసుకో, అమ్మాయిలంతా గుంపుగా వెళ్లండి, అల్లరిమూకలున్న రూట్లో కాక వేరే రూట్లో రా, చీకటి పడకముందే ఇంటికి వచ్చేయ్ అంటూ నాకే సలహాలు ఇచ్చారు తప్ప ఇబ్బంది పెడ్తున్న వాళ్లతో మీ ప్రవర్తన మార్చుకొండని అనలేదు. అవతల అబ్బాయిలు తప్పుగా మాట్లాడుతుంటే నేనెందుకు నా అలవాట్లను మార్చుకోవాలి అని ఇంట్లో వాదించేదాన్ని. మా అన్నయ్యలూ నన్నే కంట్రోల్లో పెట్టాలని చూశారు. సో.. అసలు తప్పు అక్కడుందన్నమాట. అబ్బాయిలను ఒకరకంగా.. అమ్మాయిలను ఒకరకంగా పెంచడంలో! అబ్బాయిల్లో మార్పువస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. స్త్రీల మీద హింసా తగ్గుతుంది అనుకున్నా. అందుకే అబ్బాయిలను సెన్సిటైజ్ చేసే ప్రయత్నం స్టార్ట్ చేశా. ముందసలు ఒక సంస్థ పెట్టాలనే ఆలోచనే లేదు. నాకు టైమ్ ఉన్నప్పుడల్లా మిడిల్‌క్లాస్, లోయర్ మిడిల్‌క్లాస్, స్లమ్స్ ఏరియాల్లోకి వెళ్లి అక్కడి మగపిల్లలతో మాట్లాడేదాన్ని. మొదట్లో చాలా రఫ్‌గా, ఏమాత్రం మర్యాద లేకుండా మాట్లాడేవాళ్లు. ఒకానొక దశలో ఆత్మాభిమానం దెబ్బతిని నాకెందుకొచ్చిన గోల వదిలేస్తే పోలా అనీ అనుకున్నా. కానీ నా ప్రయత్నం గురించి తెలిసిన నలుగురైదుగురు ఫ్రెండ్స్ ధైర్యం చెప్పి సపోర్ట్ చేశారు. తర్వాత నాతోపాటూ వాళ్లూ రావడం మొదలుపెట్టారు. అప్పుడే దీనికి సంబంధించి ఓ సంస్థను స్టార్ట్ చేస్తే పకడ్బందీగా పనిచేయొచ్చు అని ‘ఈక్వల్ కమ్యునిటీ ఫౌండేషన్’ను స్థాపించాం’ అని చెప్తారు రుజుతా తెర్‌దేశాయి. యునిసెఫ్ సర్వే మొన్నీమధ్యనే యునిసెఫ్ సహాయంతో ఎన్పీఆర్ అనే వెబ్‌జర్నల్ లింగ వివక్ష మీద ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలలోని పదిహేను దేశాల్లో ఒక సర్వే నిర్వహించింది. ఇప్పటికీ బాల్యవివాహాలు, రుతు సమయంలో ఆడపిల్లలను ఆరుబయట ఉంచడం, పెద్దమనిషి కాగానే చదువు మాన్పించేయడం, కూతుళ్లకు తిండిపెట్టకుండా కొడుకులకు మంచి ఆహారాన్నివ్వడం, అసలు అమ్మాయిని పెంచడమంటేనే ‘పక్కింటి తోటకు నీళ్లు పట్టడం’... అన్న ముతక భావాలతో ఆడకూతురి పట్ల తీవ్ర విక్షను చూపుతున్న దేశంగా ఆ సర్వేలో తలవంచుకున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది, అనుసరణీయమైనది కూడా. మూడు నెలల ప్రోగ్రామ్ టీనేజ్ అబ్బాయిలకు వాళ్లుండే ప్రాంతాల్లోనే స్త్రీ, పురుష సమానత్వం మీద తరగతులు నిర్వహిస్తుంటుంది ‘ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్’ సంస్థ. అమ్మాయిల పట్ల గౌరవంగా లేకపోతే సమాజంలో ఎదురయ్యే దుష్పరిణామాలను వీడియో క్లిప్పింగ్స్ద్వారా చూపిస్తుంది. నాన్న.. అమ్మను గౌరవించడం మంచి కుటుంబానికి చిహ్నం అని షార్ట్ ఫిలిమ్స్‌తో చెప్పిస్తుంది. థియరీ, ప్రాక్టికల్స్‌తో రెండంచెలుగా ఒక్కో బ్యాచ్‌కి మూడునెలల ప్రోగ్రామ్ ఉంటుంది. ‘ముందు ఎవరూ ఇష్టంగా రారు. మేమే వాళ్ల దగ్గరకు వెళ్తాం. బలవంతంగా కూర్చోబెడ్తాం. ఫస్ట్ బాలీవుడ్ సినిమాలు చూపిస్తూ.. నెమ్మదిగా వాళ్ల అటెన్షన్‌ను గైన్ చేసి తర్వాత జెండర్ ఈక్వలిటీ గురించి చెప్తాం. మారిన వాళ్లకు సర్టిఫికెట్ కూడా ఇస్తాం’ అని చెప్పారు రుజుత. పుణెలో కనిపిస్తున్న ఈ మార్పు, అందుతున్న ప్రోత్సాహంతో ఈ మధ్యే పశ్చిమబెంగాల్లో కూడా జెండర్ ఈక్వాలిటీ తరగతులు ప్రారంభించిందీ సంస్థ. స్థానికంగా ఉన్న ఎనిమిది స్వచ్ఛంద సంస్థలు దీనికి సహకారాన్ని అందిస్తున్నాయి. ‘ఈక్వల్ కమ్యునిటీ ఫౌండేషన్’కు వంద బ్రాంచ్‌లను స్టార్ట్ చేసి దేశమంతటా విస్తరించాలనేదే తమ సంస్థ భవిష్యత్ లక్ష్యం అంటారు రుజుత. ఇ.సి.ఎఫ్. వ్యవస్థాపకురాలు రుజుతా తెర్‌దేశాయి