
శ్రీ సింహ కోడూరి
‘‘ఉస్తాద్’ కథ మూడు దశల్లో ఉంటుంది. నా పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయి. ఇది పెద్ద సవాల్‌గా అనిపించింది. ముఖ్యంగా కాలేజీ ఎపిసోడ్స్ కోసం బరువు తగ్గాను’’ అన్నారు శ్రీ సింహా కోడూరి. శ్రీ సింహా కోడూరి, కావ్యా కల్యాణ్ రామ్ జంటగా నటించిన చిత్రం ‘ఉస్తాద్’.
ఫణిదీప్ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, దువ్వూరు హిమాంక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో శ్రీ సింహా కోడూరి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో సూర్య అనే యువకుడి పాత్ర చేశాను. సూర్య కాలేజీకి ముందు ఏం చేశాడు? కాలేజీ లైఫ్ ఎలా సాగింది? పైలట్ ఎలా అయ్యాడు? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment