MM Keeravani Son: Sri Simha Koduri Ustaad Movie Launched Deets Here - Sakshi
Sakshi News home page

Sri Simha Koduri: కీరవాణి తనయుడు శ్రీసింహ సినిమాకు ఉస్తాద్‌ టైటిల్‌

Published Fri, May 27 2022 8:45 AM | Last Updated on Fri, May 27 2022 10:49 AM

MM Keeravani Son Sri Simha Koduri Ustaad Movie Launched - Sakshi

‘మత్తు వదలరా, తెల్లవారితే గురువారం’ చిత్రాల ఫేమ్‌ హీరో శ్రీ సింహా కోడూరి తాజా చిత్రం ‘ఉస్తాద్‌’ షురూ అయింది. ఫణిదీప్‌ దర్శకుడు. రజనీ కొర్రపాటి, రాకేష్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి క్లాప్‌ కొట్టారు. ‘‘న్యూ ఏజ్‌ డ్రామాగా రూపొందనున్న చిత్రం ‘ఉస్తాద్‌’. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: పవన్‌ కుమార్‌ పప్పుల, సంగీతం: అకీవా. బి.

చదవండి 👇
సౌత్‌, నార్త్‌ రెండూ కలిస్తే అద్భుతాలే..
కిరాక్‌ ఆర్పీ నిశ్చితార్థం, ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement