Ustad
-
ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ కన్నుమూత
కోల్‌కతా: ప్రముఖ హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ (55)మంగళవారం కోల్‌కతా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్ను మూశారు. 2019 నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్‌తో ఆయన బాధపడుతు న్నారు. గత నెలలో గుండెపోటుకు గురైన ఖాన్ అప్పటి నుంచి ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఖాన్ మంగళవారం మధ్యాహ్నం 3.45కు తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాంపూర్–సహస్వాన్ ఘరానా సంప్రదాయానికి చెందిన ఖాన్ ఘరానా వ్యవస్థాపకుడు ఇనాయత్ హుస్సేన్ ఖాన్ ముని మనవడు. యూపీలోని బదౌన్‌కు చెందిన ఖాన్ కుటుంబం ఆయనకు పదేళ్ల వయస్సులో 1980లో కోల్‌కతాకు వలస వచ్చింది. సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లి ఖాన్ కుటుంబసభ్యులను ఓదార్చారు. రషీద్ ఖాన్ మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఇలా ఉండగా, ఖాన్ 11 ఏళ్ల వయస్సులోనే 1994లో మొట్టమొదటి కచేరీలో పాల్గొని, సంగీత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాంపూర్ సహస్వాన్ సంప్రదాయ గానా నికి చిట్ట చివరి దిగ్గజంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ‘విలంబిత్ ఖయాల్’ శైలిలో మూడు దశాబ్దాలుగా కోట్లాది మంది సంగీత ప్రియులను ఆయన గాత్రం అలరిస్తోంది. మై నేమ్ ఈజ్ ఖాన్, జబ్ వుయ్ మెట్, ఇసాక్, మంటో, మౌసమ్ తదితర చిత్రాల్లో నేపథ్య గాయకుడిగా ఉన్నారు. ఆయన్ను కేంద్రం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో గౌరవించింది. -
బిగ్ బాస్‌లోకి భర్త.. వద్దని వార్నింగ్ ఇచ్చిన టాప్ డైరెక్టర్ కూతురు
ఒకప్పుడు దర్శకుడు విజయ భాస్కర్ టాలీవుడ్లో స్వయంవరం,నువ్వే కావాలి,నువ్వునాకు నచ్చావ్,మన్మధుడు,మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు. తాజాగ ఆయన కుమారుడితో జిలేబి అనే సినిమా తీశారు. ఇందులో రాజశేఖర్ కుతురు శివాని హీరోయిన్గా నటించింది. (ఇదీ చదవండి: ఫోటోపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు) ఇప్పుడు ఆయన అల్లుడు రవి శివతేజ కూడా పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహ 'ఉస్తాద్' సినిమాలో రవి శివతేజ నటించాడు. అందులో హీరోకు బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపించాడు. తాజాగ ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉస్తాద్ గురించి స్పందించాడు. ఉస్తాద్ కథ బాగున్నా జైలర్, భోళా శంకర్ లాంటి పెద్ద సినిమాలతో విడుదల కావడం వల్ల తమకు అంత స్పేస్ దొరకలేదని చెప్పాడు. అంతేకాకుండా బిగ్ బాస్ గురించి కూడా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగులో 400కు పైగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రవి శివతేజ... విజయ భాస్కర్ కూతురు శ్యామలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడేవాడినని గుర్తుచేసుకున్నాడు. కష్ట సమయంలో ఉన్నప్పుడు తనకు శ్యామల తోడుగా నిలిచిందని చెప్పుకొచ్చాడు. తమ మధ్య ప్రేమ మొదలై నాటికి ఆమె విజయ భాస్కర్ కూతురని కూడా తనకు తెలియదని చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత అసలు విషయం తెలిశాక తమ పెళ్లి జరుగుతుందా లేదా అనే భయం పట్టుకుందని తెలిపాడు. (ఇదీ చదవండి: కొత్త సినిమాకు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌ను ఓకే చేసిన చిరంజీవి) కానీ తమకు పెళ్లి అయిందంటే అందుకు ప్రధాన కారణం శ్యామలనే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారి కుటుంబ సభ్యలను ఒప్పించిందని గుర్తుచేసుకున్నాడు. తన జీవితంలోకి ఆమె రావడం ఎంతో అదృష్టమని పేర్కొన్నాడు. కానీ బిగ్‌బాస్‌లోకి వెళ్తే తనకు విడాకులు ఇచ్చేస్తానని ఆమె వార్నింగ్ ఇచ్చిందని తెలిపాడు. తనకు కూడా ఆ షోకు వెళ్లాలనే ఆలోచనలేదని తెలిపాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
మూడు దశలు.. పెద్ద సవాల్
‘‘ఉస్తాద్’ కథ మూడు దశల్లో ఉంటుంది. నా పాత్రలో మూడు వేరియేషన్స్ ఉంటాయి. ఇది పెద్ద సవాల్‌గా అనిపించింది. ముఖ్యంగా కాలేజీ ఎపిసోడ్స్ కోసం బరువు తగ్గాను’’ అన్నారు శ్రీ సింహా కోడూరి. శ్రీ సింహా కోడూరి, కావ్యా కల్యాణ్ రామ్ జంటగా నటించిన చిత్రం ‘ఉస్తాద్’. ఫణిదీప్ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, దువ్వూరు హిమాంక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో శ్రీ సింహా కోడూరి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో సూర్య అనే యువకుడి పాత్ర చేశాను. సూర్య కాలేజీకి ముందు ఏం చేశాడు? కాలేజీ లైఫ్ ఎలా సాగింది? పైలట్ ఎలా అయ్యాడు? అనేది ఈ చిత్రకథ’’ అన్నారు. -
తెలుగమ్మాయి కావడం నాకు ప్లస్
‘‘తెలుగు పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావటం లేదని ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదు. సావిత్రి, శ్రీదేవి.. వంటి తెలుగు హీరోయిన్లు పెద్ద సక్సెస్‌ను సాధించారు. ఇండియా వైడ్ వాళ్ల కంటే సక్సెస్‌ను ఎవరూ చూడలేదు. నా విషయానికొస్తే తెలుగు అమ్మాయి కావటం నాకు ప్లస్’’ అని కావ్య కల్యాణ్ రామ్ అన్నారు. శ్రీ సింహా కోడూరి, కావ్య జంటగా నటించిన చిత్రం ‘ఉస్తాద్’. ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కావ్య కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఉస్తాద్’లో సూర్య అనే పాత్రలో శ్రీ సింహా కనిపిస్తారు. తన బైక్‌ను ఉస్తాద్ అని పిలుచుకుంటుంటాడు. ఇందులో సూర్య ప్రేయసి మేఘనగా నటించాను. నా పాత్ర నేటి తరం అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. ఇవాళ రజనీకాంత్‌గారి ‘జైలర్’, శుక్రవారం చిరంజీవిగారి ‘భోళా శంకర్’, శనివారం మా ‘ఉస్తాద్’ రిలీజవుతున్నాయి. ఆ ఇద్దరు లెజెండ్స్ సినిమాలను చూసే ప్రేక్షకుల్లో సగం మంది అయినా మా సినిమాను చూస్తే చాలు. మా సినిమా హిట్’’ అన్నారు. -
'బలగం' హీరోయిన్‌కి అవమానం!
Kavya Kalyan Ram Body Shaming: ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందరూ బయటకు సంతోషంగానే కనిపిస్తుంటారు. కానీ వాళ్లలో కొందరు సినిమా ఛాన్సుల కోసం చాలా కష్టపడుంటారు. అయితే వాటి గురించి పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. కెరీర్ సక్సెస్ లో ఉన్నప్పుడు అసలు చెప్పరు. కానీ 'బలగం' హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ మాత్రం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సామజవరగమన'.. ఆ రోజే రిలీజ్!) బాలనటిగా చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్లోకి వచ్చిన కావ్య కల్యాణ్ రామ్‌ది ఖమ్మం. 'గంగోత్రి' మూవీలో వల్లంగి పిట్టగా నటించింది. ఆ తర్వాత ఠాగూర్, బన్నీ, అడవిరాముడు తదితర చిత్రాలతో పేరు సంపాదించింది. పెరిగిన పెద్దయిన తర్వాత 'మసూద'లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. 'బలగం'తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. 'మసూద'తో హీరోయిన్గా ఈమె నటించిన 'ఉస్తాద్' రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌లో మాట్లాడిన కావ్య.. 'కెరీర్ మొదట్లో ఓ ఆడిషన్ కి వెళ్తే దర్శకనిర్మాతలు నన్ను బాడీ షేమింగ్ చేశారు. మీరు లావుగా ఉన్నారు. ఇలా ఉంటే ఛాన్సులు రావు, సన్నగా అవ్వండి అని హేళన చేశారు. కానీ నేను వాటిని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) (ఇదీ చదవండి: రూల్స్ బ్రేక్ చేసిన హీరో విజయ్.. పోలీసులు సీరియస్) -
'ఉస్తాద్'గా రాబోతున్న కీరవాణి తనయుడు శ్రీసింహ
‘మత్తు వదలరా, తెల్లవారితే గురువారం’ చిత్రాల ఫేమ్ హీరో శ్రీ సింహా కోడూరి తాజా చిత్రం ‘ఉస్తాద్’ షురూ అయింది. ఫణిదీప్ దర్శకుడు. రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టారు. ‘‘న్యూ ఏజ్ డ్రామాగా రూపొందనున్న చిత్రం ‘ఉస్తాద్’. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: పవన్ కుమార్ పప్పుల, సంగీతం: అకీవా. బి. చదవండి 👇 సౌత్, నార్త్ రెండూ కలిస్తే అద్భుతాలే.. కిరాక్ ఆర్పీ నిశ్చితార్థం, ఫొటోలు వైరల్ -
'ఉస్తాద్'గా బాలయ్య..!
తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ, 101వ చిత్రంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. హీరోయిజాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూపించే పూరి జగన్నాథ్, బాలకృష్ణను స్టైలిష్ డాన్‌గా చూపించబోతున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రోగ్ రిలీజ్ తరువాత రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఇటీవల ఈ సినిమాకు టపోరి అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే చిత్రయూనిట్ ఈ టైటిల్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మరో టైటిల్ తెర మీదకు వచ్చింది. బాలయ్య డాన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు 'ఉస్తాద్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. బాలకృష్ణ ఇమేజ్, క్యారెక్టరైజేషన్ ఈ టైటిల్ అయితేనే కరెక్ట్ అని భావిస్తున్నాడట పూరి. బాలకృష్ణతో పాటు యూనిట్ సభ్యులకు కూడా ఈ టైటిల్ నచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవుతోంది పూరి టీం.