కోల్‌కతా: ప్రముఖ హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ (55)మంగళవారం కోల్‌కతా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్ను మూశారు. 2019 నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్‌తో ఆయన బాధపడుతు న్నారు. గత నెలలో గుండెపోటుకు గురైన ఖాన్ అప్పటి నుంచి ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఖాన్ మంగళవారం మధ్యాహ్నం 3.45కు తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాంపూర్–సహస్వాన్ ఘరానా సంప్రదాయానికి చెందిన ఖాన్ ఘరానా వ్యవస్థాపకుడు ఇనాయత్ హుస్సేన్ ఖాన్ ముని మనవడు. యూపీలోని బదౌన్‌కు చెందిన ఖాన్ కుటుంబం ఆయనకు పదేళ్ల వయస్సులో 1980లో కోల్‌కతాకు వలస వచ్చింది. సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లి ఖాన్ కుటుంబసభ్యులను ఓదార్చారు. రషీద్ ఖాన్ మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.
ఇలా ఉండగా, ఖాన్ 11 ఏళ్ల వయస్సులోనే 1994లో మొట్టమొదటి కచేరీలో పాల్గొని, సంగీత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాంపూర్ సహస్వాన్ సంప్రదాయ గానా నికి చిట్ట చివరి దిగ్గజంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ‘విలంబిత్ ఖయాల్’ శైలిలో మూడు దశాబ్దాలుగా కోట్లాది మంది సంగీత ప్రియులను ఆయన గాత్రం అలరిస్తోంది. మై నేమ్ ఈజ్ ఖాన్, జబ్ వుయ్ మెట్, ఇసాక్, మంటో, మౌసమ్ తదితర చిత్రాల్లో నేపథ్య గాయకుడిగా ఉన్నారు. ఆయన్ను కేంద్రం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో గౌరవించింది.
Comments
Please login to add a commentAdd a comment