Hindustani
-
ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ కన్నుమూత
కోల్‌కతా: ప్రముఖ హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ (55)మంగళవారం కోల్‌కతా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్ను మూశారు. 2019 నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్‌తో ఆయన బాధపడుతు న్నారు. గత నెలలో గుండెపోటుకు గురైన ఖాన్ అప్పటి నుంచి ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఖాన్ మంగళవారం మధ్యాహ్నం 3.45కు తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాంపూర్–సహస్వాన్ ఘరానా సంప్రదాయానికి చెందిన ఖాన్ ఘరానా వ్యవస్థాపకుడు ఇనాయత్ హుస్సేన్ ఖాన్ ముని మనవడు. యూపీలోని బదౌన్‌కు చెందిన ఖాన్ కుటుంబం ఆయనకు పదేళ్ల వయస్సులో 1980లో కోల్‌కతాకు వలస వచ్చింది. సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లి ఖాన్ కుటుంబసభ్యులను ఓదార్చారు. రషీద్ ఖాన్ మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఇలా ఉండగా, ఖాన్ 11 ఏళ్ల వయస్సులోనే 1994లో మొట్టమొదటి కచేరీలో పాల్గొని, సంగీత కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాంపూర్ సహస్వాన్ సంప్రదాయ గానా నికి చిట్ట చివరి దిగ్గజంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ‘విలంబిత్ ఖయాల్’ శైలిలో మూడు దశాబ్దాలుగా కోట్లాది మంది సంగీత ప్రియులను ఆయన గాత్రం అలరిస్తోంది. మై నేమ్ ఈజ్ ఖాన్, జబ్ వుయ్ మెట్, ఇసాక్, మంటో, మౌసమ్ తదితర చిత్రాల్లో నేపథ్య గాయకుడిగా ఉన్నారు. ఆయన్ను కేంద్రం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో గౌరవించింది. -
బిహార్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా మాంజీ
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీ వ్యవస్థాపకుడు జితన్‌రామ్ మాంజీ ఆ రాష్ట్ర నూతన అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఫగుచౌహాన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 23 లేదా 24న కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉండటంతో అప్పటి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అసెంబ్లీ మెదటి సమావేశాలు నవంబర్ 23 నుంచి ఐదు రోజుల పాటు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తూర్పు బిహార్‌కు చెందిన 76 ఏళ్ల జితన్ రామ్ బిహార్ 23వ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2014 మే20 నుంచి 2015 ఫిబ్రవరి 20 వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జితన్ రామ్.. చంద్రశేఖర్ సింగ్, బిందేశ్వరీ దూబే, సత్యేంద్ర నారాయణ సిన్హా, జగన్నాథ్ మిశ్రా, లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. -
ఓలలాడించిన గాత్ర కచేరీలు
విశాఖ–కల్చరల్ :సంగీత ప్రియులను మైమరిపించే మధురమైన రెండు గాత్ర కచేరీలు ఓలలాడించాయి. తమ గానామతాలతో ప్రేక్షకుల మనస్సులను ఉల్లాస పరిచాయి. ఒకరు కర్ణాటక సంగీతం, మరోకరు హిందూస్తానీ గాత్రాలతో విశాఖ ప్రజల హదయాలను దోచుకున్నారు. సప్తస్వరాలు మీటే చక్కటి గళాలతో ఆలపించిన గాత్ర కచేరీల్లో పలు సంగీతరాగాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ నెలవారీ నిర్వహించిన కచేరీల్లో భాగంగా శనివారం కళాభారతి ఆడిటోరియంలో భజన బహర్ పేరుతో కర్ణాటక, హిందూస్తానీ సంగీత కచేరీలు ఏర్పాటు చేశారు. తొలుత నిర్వహించిన కర్ణాటక కచేరిలో నగరానికి చెందిన డి. విజయలక్ష్మి గళం నుంచి జాలువారిన పలు కతులు సంగీతప్రియులను మధురానుభూతిని కలిగించాయి. గణేష్ స్తుతి గీతంతో విజయలక్ష్మి తన గాత్ర కచేరిని ప్రారంభించారు. రజని నిరాజని....రంజని రాగం/ఆదితాళం, సంగీత సామ్రాజ్య సంచరణి.... మోహినాకల్యాణి రాగం/ఆదితాళం వంటి గానాలు ఆలపించారు. ద్వితీయంగా అనుపమా త్రిపాఠీ ఆలపించిన హిందూస్తానీ గాత్ర కచేరిలో పలు ఆసక్తికరమైన కతులు రాగయుక్తంగా గాత్రం చేశారు. కీబోర్డు ఎ.ఎస్.జాన్, తబలా బి. ధనంజయ్, గిటార్ ఆర్.కష్ణరావు, ప్యాడ్ రామకష్ణ, హార్మోనియం పింటు చక్కటి వాద్య సహకారం అందించారు. అలసిన మనస్సుకు సంగీతం ఓ టానిక్ కళలలో అన్నింటికంటే సంగీత కళ అలసిన మనస్సులకు టానిక్‌ల పని చేస్తోందని తూర్పు రైల్వే డివిజనల్ మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ కొనియాడారు. వీఎండీఏ ట్రస్ట్ నగరంలో భారతీయ సాంస్కతిక, సంప్రదాయ కళారంగాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. యాధచ్చక జీవన విధానంలో నగరజీవుల హదయాలను ఉల్లాసం, ఉత్సాహం,హుషారు పరిచే కళా సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని వీఎండీఏ ట్రస్ట్‌ను కొనియాడారు. అనంతరం వీఎండీఏ ట్రస్ట్ తరఫున ప్రధాన కార్యదర్శి జీఆర్కే ప్రసాద్(రాంబాబు)డీఆర్ఎం చంద్రలేఖముఖర్జిని ఘనంగా సత్కరించారు. -
భారత్.. హిందూ దేశమే!
ముంబై: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఆదివారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా హిందూ దేశమేనని పునరుద్ఘాటించారు. ‘భారతదేశం హిందూ రాజ్యం.. హిందుత్వమనేది దాని గుర్తింపు. హిందుత్వం అన్ని మతాలను తనలోనే ఇముడ్చుకుంది’ ఆయన పేర్కొన్నారు. శ్రీకష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడంతో పాటు విశ్వ హిందూ పరిషత్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ముంబైకు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కటక్ లో భారత్ లో ఉండేవారందరూ హిందూవులేనంటూ వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే దుమారం చెలరేగుతున్నా.. తాజాగా అవే వ్యాఖ్యలు చేశారు. -
ఆరెస్సెస్ చీఫ్ 'హిందుస్తానీ' వ్యాఖ్యలపై దుమారం!
న్యూఢిల్లీ: హిందుస్థాన్(భారత్)లో ఉండేవారందరూ హిందువులేనంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ అంశానికి సంబంధించి బీజేపీయేతర పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ‘ఆయన రాజ్యాంగాన్ని చదివారా? అసలు ఆయనకు దానిపై విశ్వాసముందా?’ అని ప్రశ్నించాయి. రాజ్యాంగంలో దేశాన్ని భారత్‌గా పేర్కొన్నారని, అందులో హిందుస్థాన్ అనే పదం ఎక్కడా లేదని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ చెప్పారు. భాగవత్ రాజ్యాంగాన్ని చదువుకోవాలని సూచించారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్‌లు కూడా ఇదే విధంగా స్పందించారు. భాగవత్‌కు రాజ్యాంగం సరిగ్గా తెలియదని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే సమయంలో దేశంలో చాలా మతాలున్నాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నారని, అందుకే హిందుస్థాన్‌ను వాడకుండా దేశాన్ని భారత్‌గా పేర్కొన్నారన్నారు. దేశంలో భిన్నమతాలు ఉన్నాయని, అయితే ఆరెస్సెస్ ఒకే మతం కోసం, అందర్నీ ఒకే గొడుగుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఢిల్లీకి చెందిన క్రై స్తవ మతపెద్ద ఫాదర్ సవ్రిముత్తు ఆక్షేపించారు. 'ఇంగ్లండ్ లో ఉండేవారందరూ ఇంగ్లీష్ వారు, జర్మనీలో ఉండేవారందరూ జర్మన్స్, యూఎస్ లో ఉన్నవారంతా అమెరికన్స్'అంటూ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు.