
భారత్.. హిందూ దేశమే!
ముంబై: ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ఆదివారం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా హిందూ దేశమేనని పునరుద్ఘాటించారు. ‘భారతదేశం హిందూ రాజ్యం.. హిందుత్వమనేది దాని గుర్తింపు. హిందుత్వం అన్ని మతాలను తనలోనే ఇముడ్చుకుంది’ ఆయన పేర్కొన్నారు. శ్రీకష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడంతో పాటు విశ్వ హిందూ పరిషత్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ముంబైకు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు కటక్ లో భారత్ లో ఉండేవారందరూ హిందూవులేనంటూ వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే దుమారం చెలరేగుతున్నా.. తాజాగా అవే వ్యాఖ్యలు చేశారు.