అసోంలో ముస్లిం మ్యారేజెస్‌ యాక్ట్‌ రద్దు.. | Repeal Of Muslim Marriages Act In Assam And Know Why It Was Introduced, More Details | Sakshi
Sakshi News home page

అసోంలో ముస్లిం మ్యారేజెస్‌ యాక్ట్‌ రద్దు..

Published Fri, Aug 30 2024 9:07 AM | Last Updated on Fri, Aug 30 2024 4:05 PM

Repeal Of Muslim Marriages Act In Assam National News

ఇకపై ముస్లిం పెళ్లిళ్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

న్యూఢిల్లీ: ముస్లింల పెళ్లిళ్లు, విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ అసోం అసెంబ్లీ గురువారం బిల్లును ఆమోదించింది. ముస్లిం పెళ్లి, విడాకుల చట్టం–1935 స్థానంలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆప్‌ ముస్లిం మ్యారేజెస్‌ అండ్‌ డైవోర్సెస్‌ బిల్లు–2024ను తీసుకువచి్చంది. బాల్య వివాహాలకు, బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేయడానికి హిమంత బిశ్వ శర్మ సర్కారు ఈ కొత్త బిల్లును తెచ్చింది.

గతంలో ఖాజీలు చేసిన పెళ్లిళ్లు చెల్లుబాటు అవుతాయని, ఇకపై జరిగే వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ తప్పనిసరని సీఎం హిమంత వివరణ ఇచ్చారు. కొత్త చట్టంలో ముస్లిం అమ్మాయిల కనీస వివాహ వయసును 18 ఏళ్లుగా పేర్కొన్నారు. వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే పెళ్లి సమయంలో తమ వైవాహిక స్థితిని ప్రకటించాలి. అవివాహితులా, విడాకులు తీసుకున్నారా లేక వైధవ్యం సంప్రాప్తించిందా? అనే వివరాలను వెల్లడించాలి. ఇరువురి అంగీకారంతోనే వివాహం జరగాలి. ఏ ఒక్కరి సమ్మతి లేకుండా వివాహం జరిగినా అది చెల్లదు. వివాహిత మహిళల, భర్తలను కోల్పోయిన వారి హక్కులను ఈ బిల్లు కాపాడుతుందని అసోం ప్రభుత్వం చెబుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement