Assam Assembly
-
అసోంలో ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ రద్దు..
న్యూఢిల్లీ: ముస్లింల పెళ్లిళ్లు, విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ అసోం అసెంబ్లీ గురువారం బిల్లును ఆమోదించింది. ముస్లిం పెళ్లి, విడాకుల చట్టం–1935 స్థానంలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆప్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవోర్సెస్ బిల్లు–2024ను తీసుకువచి్చంది. బాల్య వివాహాలకు, బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేయడానికి హిమంత బిశ్వ శర్మ సర్కారు ఈ కొత్త బిల్లును తెచ్చింది.గతంలో ఖాజీలు చేసిన పెళ్లిళ్లు చెల్లుబాటు అవుతాయని, ఇకపై జరిగే వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ తప్పనిసరని సీఎం హిమంత వివరణ ఇచ్చారు. కొత్త చట్టంలో ముస్లిం అమ్మాయిల కనీస వివాహ వయసును 18 ఏళ్లుగా పేర్కొన్నారు. వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే పెళ్లి సమయంలో తమ వైవాహిక స్థితిని ప్రకటించాలి. అవివాహితులా, విడాకులు తీసుకున్నారా లేక వైధవ్యం సంప్రాప్తించిందా? అనే వివరాలను వెల్లడించాలి. ఇరువురి అంగీకారంతోనే వివాహం జరగాలి. ఏ ఒక్కరి సమ్మతి లేకుండా వివాహం జరిగినా అది చెల్లదు. వివాహిత మహిళల, భర్తలను కోల్పోయిన వారి హక్కులను ఈ బిల్లు కాపాడుతుందని అసోం ప్రభుత్వం చెబుతోంది. -
జైల్లో నుంచి ఎమ్మెల్యేగా.. ప్రమాణం చేసిన అఖిల్ గొగోయ్
గువాహటి: సీఏఏ చట్టం వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో సహా నేడు 125 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు అఖిల్ గొగోయ్ కూడా నేడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు ఫలితంగా అసోం అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే జైలు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మెదటి వ్యక్తిగా అఖిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జైల్లో నుంచి శివ్‌సాగర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసిన సంగతి తెలిసిందే. తన సమీప బీజేపీ అభ్యర్థి సురభి రాజ్కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందాడు. సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం, ఇతర అభియోగాల కింద 2019 డిసెంబర్ లో గొగోయ్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అస్సాం అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మే 11 న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు అఖిల్ గొగోయ్‌కి అనుమతి ఇచ్చింది. (చదవండి:Mamata Banerjee: సీఎం కోసం పదవి త్యాగం చేసిన ఎమ్మెల్యే) -
అసోంలో 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
గువహటి: అసోంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. గత నెలలో బీజేపీలోకి చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రణబ్ కుమార్ గొగోయ్ అనర్హులుగా ప్రకటించారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలలో బొలిన్ చెటియా (సదియా), ప్రదాన్ బారువా (జొనాయ్), పల్లబ్ లోచన్ దాస్ (బెహాలి), రాజెన్ బోర్‌ఠాకూర్ (తేజ్‌పూర్), పిజూష్ హజారికా (రోహా), కృపానాథ్ మల్లా (రతబరి), అబు తాహెర్ బేపారి (గోలక్‌గంజ్), బినంద సైకియా (సిపాఝర్), జయంత మల్లా బారువా (నల్బారి) ఉన్నారు. గత నెలలో వీరు కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. 126 మంది సభ్యులున్న అసోం అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 69 ఎమ్మెల్యేలున్నారు. మేజిక్ సంఖ్య 63 కంటే మరో ఆరుగురు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఎలాంటి లోటు లేదు. -
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..
గువాహటి: నియమనిబంధనలు అతిక్రమించి సభలో ప్రతి రోజు గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసోం ప్రణబ్ గొగోయ్ స్పీకర్ ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, తొమ్మిదిమంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఈ శీతాకాల సమావేశాల్లో సభకు రానివ్వకుండా ఐదు రోజుల సస్పెన్షన్ విధించారు. అంతకుముందు రోజు సమావేశం ప్రారంభమైనప్పుడు బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ చంద్ర దేఖా స్పీకర్‌కు ఓ వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని ప్రశ్నోత్తరాలను, ఇతర వ్యవహారాలన్నింటిని రద్దు చేసి ముందు ఆ విషయంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ అనుమతించలేదు. దీంతో సభా వ్యవహారాలు జరగకుండా ప్రతిక్షణం బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు కూడా అడ్డంకులు సృష్టించారు. దీంతో సోమవారం సమావేశం ప్రారంభమైన మరు క్షణమే వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సభలో మొత్తం 126మంది సభ్యులు ఉండగా అందులో బీజేపీకి ఆరు స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. -
బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్
అసోంలో అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. మాజీ మంత్రి హిమాంత బిశ్వశర్మ నేతృత్వంలో ఇప్పటికే వీళ్లంతా అధికార పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆయన ఇంతకుముందే బీజేపీలో చేరారు. ఇలా చేరిన వారిలో.. బొలిన్ చెటియా (సదియా), ప్రదాన్ బారువా (జొనాయ్), పల్లబ్ లోచన్ దాస్ (బెహాలి), రాజెన్ బోర్‌ఠాకూర్ (తేజ్‌పూర్), పిజూష్ హజారికా (రోహా), కృపానాథ్ మల్లా (రతబరి), అబు తాహెర్ బేపారి (గోలక్‌గంజ్), బినంద సైకియా (సిపాఝర్), జయంత మల్లా బారువా (నల్బారి) ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తామంతా ఆకర్షితులం అయ్యామని, అందుకే బీజేపీలో చేరామని వాళ్లంతా చెప్పారు. పార్టీలో ఎవరు చేరాలనుకున్నా వారికి స్వాగతం పలుకుతామని అసోం బీజేపీ అధికార ప్రతినిధి రూపమ్ గోస్వామి తెలిపారు. అసోంలో బీజేపీ ప్రాచుర్యం రోజురోజుకూ పెరుగుతోందని, ఈ విషయం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడిపోవడంతో.. 126 మంది సభ్యులున్న అసోం అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 69కి పడిపోయింది. అయినా.. మేజిక్ సంఖ్య 63కు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి లోటు లేదు. -
బీజేపీలో చేరుతున్న 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
అసోంలో అధికార కాంగ్రెస్ పార్టీ చాపకిందకు నీళ్లు వస్తున్నాయి. తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని అసోం బీజేపీ అధ్యక్షుడు సిద్దార్థ భట్టాచార్య ప్రకటించారు. కాంగ్రెస్ మాజీ మంత్రి హిమాంత బిశ్వశర్మ నేతృత్వంలో ఇప్పటికే వీళ్లంతా అధికార పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆయన ఇంతకుముందే బీజేపీలో చేరారు. ఈ తొమ్మిది మందిలో నలుగురిని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. మిగిలిన ఐదుగురిని సస్పెండ్ చేయకపోయినా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వారికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఢిల్లీలో అమిత్ షాను కలిసిన ఈ తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. తాము పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. వీళ్లలో.. బొలిన్ చెటియా (సదియా), ప్రదాన్ బారువా (జొనాయ్), పల్లబ్ లోచన్ దాస్ (బెహాలి), రాజెన్ బోర్‌ఠాకూర్ (తేజ్‌పూర్), పిజూష్ హజారికా (రోహా), కృపానాథ్ మల్లా (రతబరి), అబు తాహెర్ బేపారి (గోలక్‌గంజ్), బినంద సైకియా (సిపాఝర్), జయంత మల్లా బారువా (నల్బారి) ఉన్నారు. తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని అసోం బీజేపీ అధికార ప్రతినిధి రూపమ్ గోస్వామి తెలిపారు. పార్టీలో ఎవరు చేరాలనుకున్నా వారికి స్వాగతం చెబుతున్నామన్నారు. అసోంలో బీజేపీ ప్రాచుర్యం రోజురోజుకూ పెరుగుతోందని, ఈ విషయం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. ఈ తొమ్మిది మంది రాజీనామా చేస్తే 126 మంది సభ్యులున్న అసోం అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 69కి పడిపోతుంది. అయినా.. మేజిక్ సంఖ్య 63కు ఎలాంటి లోటు లేదు. -
అసోంలో ఏఐయూడీఎఫ్ ముందంజ
గౌహతి : అసోం రాష్ట్రంలో ఇటీవల జరిగిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. అయితే రెండు స్థానాలలో ఏఐయూడీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉండగా మరో స్థానంలో బీజేపీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. రాష్ట్రంలోని మూడు శాసనసభ నియోజకవర్గాలైన సిల్చెర్, జమునాముఖ్, లక్ష్మీపూర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ మూడు నియోజకవర్గాలలో మొత్తం 25 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మరికాసేపట్లో ఎవరి భవితవ్యం ఏమిటనేది తేలనుంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలోని మూడు పార్లమెంట్ స్థానాలకు, 33 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఈ నెల 13న నిర్వహించారు. అందులోభాగంగా మంగళవారం ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది.