గువాహటి: నియమనిబంధనలు అతిక్రమించి సభలో ప్రతి రోజు గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసోం ప్రణబ్ గొగోయ్ స్పీకర్ ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, తొమ్మిదిమంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు. ఈ శీతాకాల సమావేశాల్లో సభకు రానివ్వకుండా ఐదు రోజుల సస్పెన్షన్ విధించారు. అంతకుముందు రోజు సమావేశం ప్రారంభమైనప్పుడు బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ చంద్ర దేఖా స్పీకర్కు ఓ వినతిపత్రం ఇచ్చారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని ప్రశ్నోత్తరాలను, ఇతర వ్యవహారాలన్నింటిని రద్దు చేసి ముందు ఆ విషయంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ అనుమతించలేదు. దీంతో సభా వ్యవహారాలు జరగకుండా ప్రతిక్షణం బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు కూడా అడ్డంకులు సృష్టించారు. దీంతో సోమవారం సమావేశం ప్రారంభమైన మరు క్షణమే వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సభలో మొత్తం 126మంది సభ్యులు ఉండగా అందులో బీజేపీకి ఆరు స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..
Published Mon, Dec 7 2015 2:42 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement