నేడు కాంట్రాక్టు లెక్చరర్ల రౌండ్ టేబుల్ సమావేశం
Published Mon, Dec 26 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) :
కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో మంగళవారం రౌండు టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.పవ¯ŒS సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ భద్రత కోరుతూ 24 రోజులుగా వారు సమ్మె చేస్తున్నా ప్రభుత్వ స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ కారణంగా వారు ఆందోళన చేస్తున్న శిబిరం వద్దనే ఉదయం 11 గంటలకు ఈ రౌండు టేబుల్ సమావేశం జరుగనుందన్నారు. విద్యార్థి, ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరు కావాలన్నారు. నిద్దరోతున్నప్రభుత్వాన్ని మేల్కొపడంతోపాటు కాంట్రాక్టు లెక్చరర్ల సమస్య పరిష్కారించడం ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలన్నారు.
Advertisement
Advertisement