
Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ , ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 మంగళవారం ఆరంభంలోనే మరో రికార్డు స్థాయిని తాకాయి. . సెన్సెక్స్ 351 పాయింట్ల లాభంతో 66,828.96 వద్ద, నిఫ్టీ 86 పాయింట్ల లాభంతో 19,787.50 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాలషేర్లు లాభాల్లో ఉన్నాయి.ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫార్మా సెక్టార్లు లాభాల్లో, ఆటో మొబైల్ సెక్టార్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
లాభాల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ టాప్‌లో ఉండగా, ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇతర టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నయి. ఇక ఓఎన్‌జీసి, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, భారతి ఎయిర్‌టెల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్గపోదున్నియి. మరోవైపు ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఐసిఐసిఐ లాంబార్డ్, పాలిక్యాబ్ ఈరోజు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
ఇలా మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి.
Comments
Please login to add a commentAdd a comment