జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) విడుదల చేసిన సమాచారం ప్రకారం జమ్ము కాశ్మీర్‌లో శనివారం సాయంత్రం 5.34 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. అయితే దీని కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు.
జమ్ముకాశ్మీర్‌లో సంభవించే తేలికపాటి భూకపాలు కూడా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంటాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం కిష్త్వార్ ప్రాంతంలో ఉందని అధికారులు తెలిపారు. భూమికి 10 కి.మీ లోతున ఈ భూకంప కేంద్రం ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కశ్మీర్ లోయ కూడా ఒకటి. గతంలో ప్రకృతి ప్రకోపానికి ఈ ప్రాంతం బలయ్యింది.
2005లో కశ్మీర్ లోయలో సంభవించిన భూకంపాన్ని నేటికీ ఎవరూ మరచిపోలేదు. ఆ ఏడాది అక్టోబర్ 8న ఇక్కడ బలమైన భూకంపం వచ్చింది. దీని ప్రభావానికి 69 వేల మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోగా, 75 వేల మంది గాయపడ్డారు. నాడు భూకంప తీవ్రత 7.4గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment