వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం మీడికొండ గ్రామంలో శనివారం రాత్రి వీచిన భారీ గాలులకు అగ్ని ప్రమాదం సంభవించింది.
స్టేషన్ ఘన్‌పూర్ : వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం మీడికొండ గ్రామంలో శనివారం రాత్రి వీచిన భారీ గాలులకు అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ వైర్లు తెగిపడడంతో మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకునే సరికి.... స్థానిక రైతులకు చెందిన సుమారు పది ఎకరాల్లో వరి పంట దగ్ధమైంది. అలాగే, గ్రామంలోని మామిడి తోటలకు కూడా కొంత నష్టం వాటిల్లింది.