ఆదివారం నోయిడాకు సమీపంలోని ఇటాడా గ్రామాన్ని కప్పేసిన ఇసుక తుపాను
న్యూఢిల్లీ: పెనుగాలులు, ఇసుక తుపాను, పిడుగుపాటులతో కూడిన భారీ వర్షం పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఆదివారం బీభత్సం సృష్టించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం 43 మంది చనిపోగా, నష్టం కూడా భారీగానే వాటిల్లింది. పశ్చిమ బెంగాల్‌లో నలుగురు చిన్నారులు సహా 12 మంది మరణించారు. యూపీలో 18 మంది, ఏపీలో 11 మంది, ఢిల్లీలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో గంటకు 100 కి.మీకు పైగా వేగంతో వీచిన పెనుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సాయంత్రం నాలుగు గంటలకే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. నోయిడా, పరిసర ప్రాంతాలు ఇసుక తుపానులో చిక్కుకున్నాయి. దీంతో మెట్రో, రైలు, విమాన సేవలకు అంతరాయం కలిగింది. పిడుగుపాటుకు పలు రాష్ట్రాల్లో వందలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి.
ఆదివారం నోయిడాకు సమీపంలోని ఇటాడా గ్రామాన్ని కప్పేసిన ఇసుక తుపాను
Comments
Please login to add a commentAdd a comment