న్యూఢిల్లీ: బలమైన ఈదురు గాలులు, ఇసుక తుపాను, పిడుగుపాట్లతో సంభవించిన భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాల్లో ఆది,సోమవారాల్లో 86 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే 136 మంది ప్రజలు గాయపడినట్లు వెల్లడించింది. మొత్తం మృతుల్లో 51 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారేనంది. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో 12 మంది, పశ్చిమబెంగాల్‌లో 14 మంది, బిహార్‌లో ఆరుగురు, ఢిల్లీలో ఇద్ద రు, ఉత్తరాఖండ్‌లో మరొకరు చనిపోయారంది. మరోవైపు మంగళవారం ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్లో వర్షాలు కురవచ్చని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment