అనగనగా ఒక చేప | once upon time A fish | Sakshi
Sakshi News home page

అనగనగా ఒక చేప

Published Wed, Jan 29 2014 2:21 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

once upon time A fish

 అనగనగా ఓ చేప.. పెన్నహోబిలం రిజర్వాయర్ నుంచి వస్తూ..వస్తూ.. నీటి ప్రవాహం ఆగిపోవడంతో అనంతపురం సమీపంలోని కెనాల్ వద్ద ఆగిపోయింది. దాని వెనకే మరికొన్ని చేపలు. అప్పటికే కొండెక్కిన చికెన్, మటన్ ధరలతో మాంసం ముక్క రుచి చూడని వారికి చేపల విషయం తెలిసింది. అంతే.. కెనాల్‌లోకి దిగి చేపలు పట్టసాగారు.

 ఒక దాని కోసం వెళితే మరొకటి దొరికినట్లు.. చేప కోసం వెళితే ఎండ్రకాయా దొరికింది. వాటిని పట్టుకున్నాక.. ఇంటికి తీసుకెళ్లి వండాలా? ఇక్కడే కాల్చుకుతినాలా? ఈ ప్రశ్నకు జవాబు దొరికేలోగా కొంత మంది అట్ట ముక్కలు, కంపలు తీసుకొచ్చి మంట పెట్టారు. ఎంచక్కా.. ఎండ్రకాయల్ని కాల్చుకు తిని..  ‘అబ్బ.. ఏముందిరా’ అనుకుంటూ చేపల్ని ఇంటికి తీసుకెళ్లిపోయారు.  
 - న్యూస్‌లైన్, అనంతపురం     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement