గట్టు, న్యూస్‌లైన్: ఉన్న ఊరు..పుట్టి పెరి గిన ఊరిలో ఉండలేక ఆలూరు వాసులు ముంపు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ముంపు గ్రామమైన ఆలూరులో ఇప్పటికే వందలాది ఎకరాల్లో పం టలు నీటమునిగాయి. అయినా అధికారులకు కనువిప్పు కలగడం లేదు. పునరా వాసచర్యలను వేగవంతం చేసి బాధితుల కు స్వాంతన చేకూర్చులనే కనీసం ధర్మా న్ని విస్మరించారు. రిజర్వాయర్‌కు నీటి విడుదల కొనసాగుతుండటంతో ఇప్పటి కే ఆలూరు స్టేజీ నుంచి గ్రామానికి వెళ్లే ర హదారి పూర్తిగా నీటమునిగింది. అలాగే స్టేజీ మీద ఉండే కొత్తకాలనీ వాసులు చు ట్టు తిరిగి ఊళ్లోకి రావాల్సి వస్తుంది. అయినప్పటికీ అధికారులు ర్యాలంపాడు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. గ్రామ సమీపంలోకి నీళ్లు చేరడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కా లం గడుపుతున్నారు. మరోవారం రోజు ల పాటు నీటి పంపింగ్ కొనసాగితే పూర్తి గా గ్రామంలోకి పూర్తికా నీళ్లొచ్చే అవకాశం ఉంది.
పూర్తికాని పునరావాసం
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణం లో భాగంగా ర్యాలంపాడు రిజర్వాయర్ కు సమీపంలో ఉన్న ఆలూరును ముంపు ప్రాంతంగా ప్రకటించారు. ఇక్కడ మూ డువేల మంది నివాసం ఉంటున్నారు. ఇ ప్పటికే ముంపు బాధితులకు పరిహారం కూడా అందజేశారు. అయితే పునరావాస కేంద్రంలో సౌకర్యాలు కల్పించకుండానే కేవలం పట్టాలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
దీంతో ఆలూరు నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ఇచ్చి న పట్టాలకు పునరావాస కేంద్రంలో నెం బర్లు కేటాయించలేదని గ్రామస్తులు వా పోతున్నారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటిమట్టం పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉన్న ఊరును ఖా ళీ చేద్దామంటే పునరావాస కేంద్రంలో ప నులు పూర్తి కాలేదు. అలాగే పాఠశాలకు సమీపంలోకి నీళ్లు చేరడంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా ఆం దోళన చెందుతున్నారు. ఆట విడుపు స మయంలో విద్యార్థులు రిజర్వాయర్ నీటి వైపు వెళ్లకుండా ఉపాధ్యాయులు కా పాలాకాయాల్సి వస్తోంది. స్టేజీ వద్ద కొత్తకాలనీలో ఉన్న ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు కూతవేటు దూరంలో ఉన్న పాఠశాలకు కిలోమీటన్నర చుట్టూ తిరిగి రావాల్సి వ స్తుంది.
పంట నీటిపాలు
ర్యాలంపాడు రిజర్వాయర్ కింద పం టలు సాగుచేయొద్దని అధికారుల ముం దస్తుగా చెప్పని కారణంగా ఆలూరు రైతు లు ఈ ఏడాది ఖరీఫ్‌లో పెద్ద ఎత్తున పం టలు నష్టపోవాల్సి వచ్చింది. మరో మూ డు నెలలు గడిస్తే కేవలం సీడ్ పత్తి ద్వారా ఈ రైతులు సుమారు కోటిన్నర విలువైన పంటను పండించేవారు. ర్యాలంపాడు రి జర్వాయర్‌కు నీటి విడుదల కారణంగా 60 ఎకరాల్లో సాగుచేసిన పత్తి పంట మొ త్తం నీటిలో మునిగిపోయింది. దీంతో సుమారు తీవ్రనష్టం వాటిల్లినట్లయింది. కళ్లెదుటే నీటమునుగుతున్న పంటను చూస్తూ ఉండలేక కొందరు రైతులు కా యలు పట్టిన పత్తి మొక్కలను పెరికి గడ్డ కు వేసుకుంటున్నారు. మరికొందరు ప త్తి కాయలను తెంచి ఇంట్లో ఆరబెట్టుకుం టున్నారు. వీటితో పాటు ఆముదం, వరి, జొన్న, వేరుశనగ తదితర పంట పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీంతో బాధిత రై తులు లబోదిబోమంటున్నారు.
ముంపు ముప్పు ఏది కనువిప్పు
Published Sun, Sep 1 2013 6:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM
Advertisement
Advertisement