మూసీనదిలో ఇటుకుల పహడ్, వంగమర్తి, కొత్తగూడెం ప్రాంతాలల్లో ఇసుక రవాణాను నిలిపివేయాలని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు బైరబోయిన జానయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మూసీనదిలో ఇటుకుల పహడ్, వంగమర్తి, కొత్తగూడెం ప్రాంతాలల్లో ఇసుక రవాణాను నిలిపివేయాలని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు బైరబోయిన జానయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సహజ వనరులైన ఇసుక లూఠీని అరికట్టలని కోరారు. ఇప్పటికే కరువుతో రైతులు అల్లాడిపోతుంటే ఇసుక తవ్వకంతో వారి పరిస్థితి మరింత దిగజారనున్నాయని వివరించారు. మూసీ నదిలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక రవాణాతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి సాగు, తాగునీటికి తీవ్రమైన కొరత ఏర్పడనుందని తెలిపారు. మూసీలో ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.