ఇసుక లోడుతో వస్తున్న టాక్టర్ రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఇసుక లోడుతో వస్తున్న టాక్టర్ రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్లలో జరిగింది. దామరచర్లకు చెందిన శ్రీనివాస్(45) మంగళవారం తెల్లవారు జామున ట్రాక్టర్‌లో ఇసుక నింపుకుని వెళుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయబావిలో పడింది. ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.