సాక్షి,హైదరాబాద్ : మూసీని మురికికూపంగా మార్చారన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకీభవించారు. కానీ మూసీని మురికికూపంగా మార్చిన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనన్నారు కేటీఆర్. 70 శాతం పారిశ్రామిక వ్యర్థాలు మూసీలోనే కలుస్తున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.
మూసీ శుద్ధిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన కేటీఆర్.. ఢిల్లీకి మూటలు పంపడం కోసమే సీఎం రేవంత్‌కు మూసీపై ప్రేమ పుట్టికొచ్చిందన్నారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు. నోట్ల రద్దు సమయంలో మోదీ మాటలు మార్చినట్లు.. మూసీపై రేవంత్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్‌రెడ్డి. లక్షన్నర కోట్లు ఖచ్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్‌రెడ్డినే. మూసీపై ప్రభుత్వం అస్సలు సర్వేనే చేయలేదు. తన చేసిన పాపం బయటకి రావటంతో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పడ్తున్నాయి. గ్రాఫిక్స్ మాయాజాలంతో రేవంత్ అబద్దాలు చెప్పారు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment