Published
Wed, Aug 17 2016 6:46 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
మూసీ కాల్వలకు మరమ్మతులు
సూర్యాపేటరూరల్ : ఎన్నో సంవత్సరాలుగా అధ్వానంగా ఉన్న మూసీ కాలువలు కొన్ని రోజులుగా శుభ్రం అవుతున్నాయి. పిల్లలమర్రి గ్రామంతో పాటు చాలా గ్రామాల్లోని మూసీ కాలువలు ఉపాధిహామీ పథకం కింద కూలీలు చెత్తాచెదారం, కంపచెట్లను తొలగిస్తున్నారు. అన్ని గ్రామాల్లోని మూసీ కాలువలు శుభ్రం చేయడంతో పాటు తూములు మరమ్మతు చేస్తే మూసీ ప్రాజెక్ట్ ఆయకట్టు వరకు సాగునీరు అందుతాయని రైతులు పేర్కొంటున్నారు. కాలువలు శుభ్రం చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.