సాక్షి, జన్నారం(ఆదిలాబాద్): చిన్నారి విష్ణువర్ధన్ వైద్యానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఈనెల 28న పసివారికి ప్రాణం పోయండి అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచూరితమైన కథనాన్ని కవ్వాల్ గ్రామానికి చెందిన తిరుపతి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసి, ఆదుకోవాలని కోరారు. మంత్రి ఆఫీస్ నుంచి స్పందిస్తూ బాధిత కుటుంబ వివరాలను తెలియజేయాలని గురువారం రీట్వీట్ చేశారు. దీంతో విష్ణువర్ధన్ వైద్యానికి భరోసా లభించినట్లేనని చిన్నారి తండ్రి రమేశ్ తెలిపారు. అదేవిధంగా పలువురు దాతలు ఆన్‌లైన్ ద్వారా సాయమందించినట్లు ఆయన పేర్కొన్నారు.
నీలోఫర్‌కు ‘నెలరోజుల బాబు’
ఖానాపూర్: మండలంలోని సేవ్యానాయక్ తండాకు చెందిన బి.గబ్బర్‌సింగ్, సుమలత దంపతుల నెలరోజుల వ యస్సు గల శిశువు అనారోగ్య పరిస్థితిపై ‘వెంటిలేటర్‌పై నెలరోజుల బాబు’ అనే శీర్షికతో ఈనెల 29న ‘సాక్షి’లో ప్రచూరితమైన కథనానికి ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు. ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ వినిత్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఖానాపూర్ ఆరోగ్యమిత్ర సునీత గ్రామంలోని బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు.
శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న చిన్నారిని కుటుంబ సభ్యులు నిర్మల్ నుంచి నిజామాబాద్ తీసుకెళ్లిన ఆరోగ్యం కుదుట పడలేదన్నారు. దీంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ రెఫర్ చేశామని ఆరోగ్యమిత్ర సునీత గురువారం ‘సాక్షి’కి తెలిపారు.
చదవండి: కేకేకు కోవిడ్ పాజిటివ్
Comments
Please login to add a commentAdd a comment