హరీశ్‌కు కేటీఆర్‌ ట్వీట్‌ | KTR Birthday Wishes to Harish Rao | Sakshi
Sakshi News home page

హరీశ్‌కు కేటీఆర్‌ ట్వీట్‌

Published Sat, Jun 3 2017 1:50 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

హరీశ్‌కు కేటీఆర్‌ ట్వీట్‌

హరీశ్‌కు కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: తెలంగాణ భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్‌రావుకు కేటీఆర్‌ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హరీశ్‌రావు సమర్థవంతుడైన నాయకుడని కొనియాడారు.

‘స్పష్టమైన భావప్రకటన, కష్టపడేతత్వం, సమర్థత కలిగిన కొంతమంది నాయకుల్లో ఒకరైన హారీశ్‌రావు గారికి జన్మదిన శుభాకాంక్షల’ని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ట్విటర్ ద్వారా హరీశ్‌రావుకు శుభాకాంక్షలు తెలిపింది.

మరోవైపు హరీశ్‌రావు తన నియోజకవర్గం సిద్ధిపేటలో కలియ తిరిగారు. ఇంటింటికీ వెళ్లి అభిమానులను అప్యాయంగా పలకరించారు. బాలింతలకు కేటీఆర్‌ కిట్లు పంపిణీ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు పోటీ పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement