యశవంతపుర: విద్యార్థినిని రోజు కాలేజీకి తీసుకెళ్తున్న కారు డ్రైవర్ ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్న ఘటన విజయపుర జిల్లా జాలగేరి గ్రామంలో జరిగింది. విజయపురలో ఒక కుటుంబం వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తున్న సోమలింగ ఆ కుటుంబానికి చెందిన అక్షతను రోజూ బైక్‌పై కాలేజీ వద్ద వదిలేవాడు. ఈ సమయంలో మాయమాటలు చెప్పి ఆమెతో ప్రేమాయణం మొదలుపెట్టాడు.
అయితే సోమలింగకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. బీకాం పూర్తి చేసిన అక్షత మేజర్ కావడంతో ఇటీవల ఇద్దరూ పెళ్లి చేసుకుని రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా నమోదు చేసుకున్నారు. సోమలింగ, అతని మొదటి భార్యతో కలిసి అన్యోన్యంగా జీవిస్తానని అక్షత చెప్పడం గమనార్హం. పుట్టింటి నుంచి హాని ఉందని ఆదివారం జిల్లా ఎస్పీకి రక్షణ కోసం విజ్ఞప్తి చేసింది. ఈ తతంగం చూసి జిల్లావాసులు ఆశ్చర్యపోయారు.
Comments
Please login to add a commentAdd a comment