కాంచీపురం: కళాశాల విద్యార్థినిని బెదిరించి ఆమె స్నేహితుడి ఎదుటే ఐదుగురు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురం సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బెంగళూరు–పుదుచ్చేరి రహదారి పక్కనున్న ప్రైవేట్ స్కూల్ ఆవరణలో బాధితురాలు తన స్నేహితుడితో మాట్లాడుతోంది.
అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఐదుగురు వ్యక్తులు వారిని ముట్టడించారు. చంపుతామని బెదిరిస్తూ స్నేహితుడు చూస్తుండగానే ఆ విద్యార్థినిపై అత్యాచారానికి వడిగట్టారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని బాధితురాలు, ఆమె స్నేహితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment