క్రేన్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కాలేజీ విద్యార్థిని బలి | Bengaluru: College student crushed under wheels of mobile crane | Sakshi
Sakshi News home page

క్రేన్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం.. కాలేజీ విద్యార్థిని బలి

Published Sat, Nov 5 2022 8:16 AM | Last Updated on Sat, Nov 5 2022 8:16 AM

Bengaluru: College student crushed under wheels of mobile crane - Sakshi

మృతురాలు నూర్‌పీజా(ఫైల్‌), ప్రమాదానికి కారణమైన క్రేన్‌  

సాక్షి, బెంగళూరు(బనశంకరి): క్రేన్‌డ్రైవర్‌ నిర్లక్ష్యానికి విద్యార్థిని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కళాశాలనుంచి ఇంటికి వెళ్తుండగా క్రేన్‌ ఢీకొని గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నూర్‌పీజా అనే విద్యార్థిని మృతి చెందింది. వివరాలు..  వైట్‌ఫీల్డ్‌ సమీపంలోని  కన్నమంగల నివాసి నూర్‌పీజా(19) ఈనెల 2న ఇంటికి కాలినడకన బయల్దేరింది.

కన్నమంగల గేట్‌ వద్ద ఓ క్రేన్‌ను డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడుపుతూ వచ్చి నూర్‌పీజాను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించగా రెండురోజులపాటు చావుబతుకుల మధ్య పోరాడుతూ శుక్రవారం మృతి చెందింది. క్రేన్‌ యజమాని పెరియస్వామిపై యువతి తండ్రి రెహమాన్‌ఖాన్‌ వైట్‌ఫీల్డ్‌పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

చదవండి: (Hyderabad: ప్రాణం తీసిన వేగం.. ఇద్దరు బీబీఏ విద్యార్థుల దుర్మరణం)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement