విద్యార్థినిపై డాక్టర్, కానిస్టేబుళ్ల అత్యాచారం!
రాయ్‌పూర్: ఓ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఆరోపణలతో చత్తీస్‌ఘడ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు, ఇద్దరు కానిస్టేబుళ్లు గురువారం అరెస్టయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ గౌతం పండిట్‌తో పాటు కానిస్టేబుళ్లు చంద్రప్రకాశ్ పాండే, సౌరబ్ భక్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే గత సంవత్సరం జూన్ 19న రోడ్డు ప్రమాదంలో గాయపడిన 22 ఏళ్ల విద్యార్థిని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. ఆ సమయంలో డాక్టర్‌తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ సన్నివేశాలను చిత్రీకరించారు.
ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత కూడా కానిస్టేబుళ్లు ఇద్దరూ వేధించడం మొదలు పెట్టారు. వీడియో చూపించి బెదిరిస్తూ, ఆమెను శారీరకంగా వాడుకుంటున్నారు. మంగళవారం కూడా ఆమెను నగర శివార్లలోకి తీసుకువెళ్లారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరంచడంతో పోలీసులు పారిపోయారు.
రాత్రి 11 గంటల ప్రాంతంలో నగర శివారులోని ఒక పవర్ హౌస్ వద్ద విద్యార్థినిని చూసిన పోలీసులు ప్రశ్నించారు. ఆమె మొత్తం జరిగిన సంఘటనను పోలీసులకు వివరించింది. విద్యార్థిని, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ డాక్టర్ను, ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ రాజేష్ అగర్వాల్ చెప్పారు.