ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పట్టపగలే నడిరోడ్డుపై కాలేజీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ క్రూరంగా ప్రవర్తించాడు. ఈ ఘోరం సీఎం ఏక్‌నాథ్ షిండే నియోజకవర్గం థానే నగరంలో చోటుచేసుకోవడం గమనార్హం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వివరాలు 21 ఏళ్ల యువతి కళాశాలకు వెళ్తుండగా రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఆటో డ్రైవర్ అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో యువతి అతినిపై ఎదురు తిరిగి ప్రశ్నించగా.. అతడు ఆమె చేతిని పట్టుకొని లాగాడు.
తరువాత నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా యువతి అతడిని వదిలిపెట్టలేదు. ఆటో తీసి పరారవుతుండగా అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. అయితే ఆటో డ్రైవర్ యువతిని అలాగే 500 మీటర్లు తన బండితోపాటు ఈడ్చుకెళ్లాడు. అనంతరం ఆమెను ఓ చోట కింద పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. యువతిని గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆటోరిక్షా డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది
Shocking!
— Shraddhey (@shraddhey) October 14, 2022
In CM’s constituency by an autodriver. HM should resign.#Maharashtra https://t.co/dL5JV3kMip
Comments
Please login to add a commentAdd a comment