తుంగతుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ విద్యార్ధి మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. కొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతున్నరవి మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చాడు. తరగతికి వెళ్లే లోపు.. కాలేజీ ఆవరణలో కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో కళాశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.
గుండెపోటుతో విద్యార్థి మృతి
Published Tue, Sep 15 2015 11:29 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement