అనారోగ్యంతో చెల్లి.. గుండెపోటుతో అక్క..  | Sister Passed Away Of Heart Attack After Seeing Her Sister Ill Health In Nalgonda District | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో చెల్లి.. గుండెపోటుతో అక్క.. 

Published Mon, Feb 14 2022 1:38 AM | Last Updated on Mon, Feb 14 2022 2:47 PM

Sister Passed Away Of Heart Attack After Seeing Her Sister Ill Health In Nalgonda District - Sakshi

ఎలిమినేటి ఈరమ్మ ఎలిమినేటి లక్ష్మమ్మ 

డిండి: అనారోగ్య కారణాలతో బాధపడుతున్న చెల్లి కన్నుమూసింది. ఆమె మృతిని జీర్ణించుకోలేక అక్క కూడా గుండెపోటుతో తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండల పరి«ధిలోని సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఎలిమినేటి ఈశ్వరయ్యకు అదే గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(62)తో వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. దీంతో ఈశ్వరయ్య తన భార్య సోదరి ఈరమ్మ(57)ను రెండో వివాహం చేసుకున్నాడు.

ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె జన్మించారు. వారికి వివాహాలు కావడంతో వేరుగా ఉంటున్నారు. పదిహేనేళ్ల క్రితం ఈశ్వరయ్య కాలం చేశాడు. దీంతో అక్కాచెల్లెళ్లు లక్ష్మమ్మ, ఈరమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈరమ్మ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. అది తట్టుకోలేక అక్క లక్ష్మమ్మకు గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు విడిచింది. నిమిషాల వ్యవధిలో అక్కాచెల్లెళ్లు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement