![Police Officials Dought on College Student Misiisng Case - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/2/amw.jpg.webp?itok=C6lzOwZ4)
జష్టా(ఫైల్)
సాక్షి ప్రతినిధి, చెన్నై: కాంచీపురం సమీపంలో సజీవ దహనమైన యువతి కేరళలో అదృశ్యమైన కాలేజీ విద్యార్థినిగా పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేరళ రాష్ట్రం పత్తనమదిట్ట జిల్లాకు చెందిన జష్టా అనే యువతి పంజారపల్లిలోని కళాశాల్లో రెండో సంవత్సరం చదువుతోంది. ఈ ఏడాది మార్చి 22 నుంచి జష్టా అదృశ్యమైంది. దీనిపై ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె కోసం గాలించారు. జష్టా అదృశ్యమై 50 రోజులు దాటినా ఇంతవరకు ఆచూకీ లేని పరిస్థితుల్లో, ఆమె ఆచూకీ తెలిపిన వారికి రూ.2లక్షలు బహుమానాన్ని కేరళ పోలీసులు ప్రకటించారు.
గత 28వ తేదీన తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు, పడవేరి జాతీయ రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలో సజీవ దహనమైన స్థితిలో యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృతురాలి వయస్సు, శరీరపు కొలతలను బట్టి ఆమె జష్టా అయిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాంచీపురం జిల్లా పోలీసు కమిషనర్ సంతోష్ అదమని కేరళ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment