మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో ఓ కాలేజీ విద్యార్థికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. థానే అడిషనల్ సెషన్స్ జడ్జి వీవీ విర్కార్ ఈ మేరకు తీర్పునిచ్చారు.
థానే: మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో ఓ కాలేజీ విద్యార్థికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. థానే అడిషనల్ సెషన్స్ జడ్జి వీవీ విర్కార్ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
థానేలో యోగేష్ గోవింద్ సోలంకి అనే విద్యార్థి, మరో 14 ఏళ్ల విద్యార్థిని ఒకే ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆ అమ్మాయితో సన్నిహితంగా మెలిగిన సోలంకి.. మూడేళ్ల క్రితం పెళ్లి పేరుతో ఆమెను రాజ్కోట్ తీసుకెళ్లాడు. అనంతరం ఆ అమ్మయి బంధువులు సోలంకిపై మైనర్ బాలికను అపహరించడం, అత్యాచారం చేయడం వంటి నేరాలు కింద కేసు పెట్టారు. నిందితుడు నేరం చేసినట్టు రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది.