కుర్రాళ్లు చదువుకునేందుకు కాలేజీలో చేరుతారు. అలా కాలేజీలో చేరిన కుర్రాళ్లు బాగా చదువుకోవాలని అటు అధ్యాపకులు, ఇటు తల్లిదండ్రులు పరితపిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కుర్రాళ్లు దారితప్పుతుంటారు. అలా నేర సంబంధమైన కార్యకలాపాల్లోకి అడుగు పెడుతుంటారు. తాజాగా ఇటువంటి ఉదంతం కర్నాటకలోని శివమొగ్గలో చోటుచేసుకుంది.
అద్దెకు ఇల్లు తీసుకుని..
కర్నాటకలోని శివమొగ్గకు చెందిన ఒక కుర్రాడు తాను ఉంటున్న అద్దె ఇంటిలోనే గంజాయి మొక్కలు పెంచడం ప్రారంభించాడు. తరువాత వాటిని అక్రమంగా విక్రయిస్తున్నాడు. ఈ ఉదంతంలో పోలీసులు తమిళనాడు, కేరళకు చెందిన ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. వీరంతా హైటెక్ పద్ధతిలో గంజాయి సాగు చేసిన గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్నారు.
ఇద్దరు విద్యార్థులు గంజాయి కొనుగోలుకు రాగా..
కర్నాటక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని తమిళనాడులోని కృష్ణాగిరి నివాసి విఘ్నరాజ్‌గా గుర్తించారు. ఇతను ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అతను తాను ఉంటున్న ఇంటిలో గంజాయి సాగు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. శివమొగ్గ పోలీసు అధికారి జీకే మిథున్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుడు గత మూడున్నర నెలలుగా గంజాయి క్రయవిక్రయాల్లో పాల్గొంటున్నాడన్నారు. ఇతనికి కేరళకు చెందిన వినోద్ కుమార్, తమిళనాడుకు చెంది పండీదోరాయ్‌కు సహకరిస్తున్నారని, ఈ ముగ్గురినీ అరెస్టు చేశామన్నారు. విఘ్నరాజ్ ఇంటికి గంజాయి కొనుగోలుకు ఈ ఇద్దరు కుర్రాళ్లు రాగా, వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
పలు మత్తు పదార్థాలు స్వాధీనం
పోలీసులు నిందితుని ఇంటిపై దాడి చేసి 277 గ్రాముల గంజాయి, 1.63 కిలోల పచ్చి గంజాయి, 10 గ్రాముల చెరస్, గంజాయి విత్తనాల బాటిల్, 19 వేల రూపాలయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: రెండో పెళ్లికి పసిపిల్లలు అడ్డొస్తున్నారని..
Comments
Please login to add a commentAdd a comment