rented home
-
కాలేజీ కుర్రాళ్ల రహస్య ‘స్టార్టప్’.. బండారం బయటపడిందిలా..
కుర్రాళ్లు చదువుకునేందుకు కాలేజీలో చేరుతారు. అలా కాలేజీలో చేరిన కుర్రాళ్లు బాగా చదువుకోవాలని అటు అధ్యాపకులు, ఇటు తల్లిదండ్రులు పరితపిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కుర్రాళ్లు దారితప్పుతుంటారు. అలా నేర సంబంధమైన కార్యకలాపాల్లోకి అడుగు పెడుతుంటారు. తాజాగా ఇటువంటి ఉదంతం కర్నాటకలోని శివమొగ్గలో చోటుచేసుకుంది. అద్దెకు ఇల్లు తీసుకుని.. కర్నాటకలోని శివమొగ్గకు చెందిన ఒక కుర్రాడు తాను ఉంటున్న అద్దె ఇంటిలోనే గంజాయి మొక్కలు పెంచడం ప్రారంభించాడు. తరువాత వాటిని అక్రమంగా విక్రయిస్తున్నాడు. ఈ ఉదంతంలో పోలీసులు తమిళనాడు, కేరళకు చెందిన ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. వీరంతా హైటెక్ పద్ధతిలో గంజాయి సాగు చేసిన గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు గంజాయి కొనుగోలుకు రాగా.. కర్నాటక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని తమిళనాడులోని కృష్ణాగిరి నివాసి విఘ్నరాజ్గా గుర్తించారు. ఇతను ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అతను తాను ఉంటున్న ఇంటిలో గంజాయి సాగు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. శివమొగ్గ పోలీసు అధికారి జీకే మిథున్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుడు గత మూడున్నర నెలలుగా గంజాయి క్రయవిక్రయాల్లో పాల్గొంటున్నాడన్నారు. ఇతనికి కేరళకు చెందిన వినోద్ కుమార్, తమిళనాడుకు చెంది పండీదోరాయ్కు సహకరిస్తున్నారని, ఈ ముగ్గురినీ అరెస్టు చేశామన్నారు. విఘ్నరాజ్ ఇంటికి గంజాయి కొనుగోలుకు ఈ ఇద్దరు కుర్రాళ్లు రాగా, వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పలు మత్తు పదార్థాలు స్వాధీనం పోలీసులు నిందితుని ఇంటిపై దాడి చేసి 277 గ్రాముల గంజాయి, 1.63 కిలోల పచ్చి గంజాయి, 10 గ్రాముల చెరస్, గంజాయి విత్తనాల బాటిల్, 19 వేల రూపాలయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: రెండో పెళ్లికి పసిపిల్లలు అడ్డొస్తున్నారని.. -
అద్దెగదుల ఆధునీకరణ
-
కరోనా: మానవత్వం మరచి..
సాక్షి, గుంటూరు: కరోనా కల్లోలంతో అనేక అవస్థలకు గురవుతున్న నేపథ్యంలో కొందరు మానవత్వం మరచిపోతున్నారు. జాలి, దయ, కరుణ చూపాల్సిన తరుణంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లినందున అద్దె ఇంట్లోకి రావద్దని హుకుం జారీచేస్తున్నారు. తక్షణం ఇంటిని ఖాళీచేసి వెళ్లాల్సిందేనని యజమానురాలు తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. కుమారుడు పోలీసు ఉన్నతాధికారి కావడంతో ఆయన తన పలుకుబడిని ఉపయోగిస్తూ తల్లికి వత్తాసు పలుకుతున్నారనే తీవ్రారోపణలు వస్తున్నాయి. ఆ అధికారి సిఫార్సుతో తెనాలిలోని అధికారులు ఫోన్ ద్వారా ఒత్తిళ్లు తెస్తున్నారు. (పులి కోసం ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు) తెనాలి చినరావూరులో తల్లి, 23 ఏళ్ల కూతురు నివాసం ఉంటున్నారు. అనారోగ్యంతో మార్చి 24న కూతురు ఆసుపత్రిలో మృతిచెందారు. షాక్‌కు గురైన తల్లికి 26న పక్షవాతం సోకింది. తెనాలి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తరువాత మరుసటి రోజు అంబులెన్స్‌లో తీసుకెళ్లగా యజమానురాలు ఇంట్లోకి రానీయలేదు. అంబులెన్స్‌లో తీసుకొచ్చారని, కరోనా ఉండవచ్చని అభ్యంతరం చెపుతూ పరీక్ష చేయించుకుని రావాలని ఒత్తిడి తెచ్చారు. నెగటివ్ రిపోర్టును చూపినా అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో స్వస్థలమైన భట్టిప్రోలు మండలంలోని పెదలంకకు బంధువులు ఆమెను తీసుకెళ్లారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ ఫోన్లో ఒత్తిళ్లు ... వెంటనే వచ్చి ఇల్లు ఖాళీ చేయాలంటూ ఫోన్ ద్వారా నిత్యం ఒత్తిళ్లు తెస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి పెద్ద కూతురు హైదరాబాద్‌లో ఉంటున్నారు. లాక్డౌన్ వల్ల తన చెల్లెలి చివరిచూపునకు కూడా తాము నోచుకోలేకపోయామని ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. తన ఐదు నెలల బిడ్డతో పాటు అమ్మమ్మ కూడా ఉంటుందని, లాక్డౌన్ ముగిశాక తెనాలికి వచ్చి ఇల్లు ఖాళీచేస్తామని ఎంత చెపుతున్నా అంగీకరించడంలేదని వాపోయారు. ఈ పరిస్థితుల్లో తాము ఎవరికి చెప్పుకోవాలో కూడా అంతుబట్టడంలేదని ఆవేదన చెందారు. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలని విన్నవించారు. -
సెబాస్టియన్..ఓ కబ్జా కోరు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందుతుడిగా ఉన్న సెబాస్టియన్ హారీకి సంబంధించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అద్దెకి దిగిన ఇంటినే కబ్జా చేయాలని చూస్తున్నాడని యజమాని ఫిలిప్స్ అవేదన వ్యక్తం చేశారు. 2003 లో సెబాస్టియన తన భార్య పేరు మీద ఎర్రగడ్డలోని తమ ఇంట్లో అద్దెకి దిగాడని చెప్పారు. 2008 లో తమకే ఇళ్లు అవసరం ఉందని ఖాళీ చేయాల్సిందిగా కోరగా, వాళ్ల బాబుకు పరీక్షలు ఉన్నాయని చెప్పి.. ఆ తర్వాత ఖాళీ చేయడానికి నిరాకరించారని చెప్పారు. దీంతో కోర్టును కూడా ఆశ్రయించగా, తన సంతకం ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పించి స్టే తీసుకొచ్చారని పిలిప్స్ ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించలేదని, మానసింగా ఇబ్బందిపెడుతున్నాడని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ఇళ్లలో హై రెసొల్యూషన్ తో అమర్చిన సీసీ కెమెరాలు విచారణలో కీలకంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి పూర్తి ఫూటేజిని ఏసీబీ అధికారులు సేకరించారు. -
కొత్త ఇంట్లోకి చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త ఇంటికి మారారు. జూబ్లిహిల్స్ రోడ్ నెం. 65లో ఉంటున్న చంద్రబాబు కుటుంబం, జూబ్లిహిల్స్ రోడ్ నెం. 24లో గల ఓ అద్దె ఇంట్లోకి మారారు. ఇప్పటి వరకు ఉన్న ఇంటిని కూల్చి దాని స్థానంలో భారీ భవంతిని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అది పూర్తి కావడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేతలు, సందర్శకుల తాకిడి పెరగడంతో ఇళ్లు ఇరుకుగా మారిందని, దీంతో ఇప్పటి వరకు ఉన్న ఇంటిని కూల్చివేసి, ఆ స్థానంలో కొత్త భవన నిర్మాణాన్ని నిర్మించనున్నారు. అయితే ఇంటి మార్పుకు వాస్తు కూడా ఒక కారణం అయి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతొంది. బాబు మూడోసారి సీఎం పీఠం ఎక్కిన తరవాత వాస్తుకు ప్రాధాన్యం ఇచ్చి రూ.కోట్లు వెచ్చించి సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్, క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తున్న లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లలో అనేక మార్పుచేర్పులు చేసిన విషయం తెలిసిందే.