కొత్త ఇంట్లోకి చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త ఇంటికి మారారు. జూబ్లిహిల్స్ రోడ్ నెం. 65లో ఉంటున్న చంద్రబాబు కుటుంబం, జూబ్లిహిల్స్ రోడ్ నెం. 24లో గల ఓ అద్దె ఇంట్లోకి మారారు. ఇప్పటి వరకు ఉన్న ఇంటిని కూల్చి దాని స్థానంలో భారీ భవంతిని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అది పూర్తి కావడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేతలు, సందర్శకుల తాకిడి పెరగడంతో ఇళ్లు ఇరుకుగా మారిందని, దీంతో ఇప్పటి వరకు ఉన్న ఇంటిని కూల్చివేసి, ఆ స్థానంలో కొత్త భవన నిర్మాణాన్ని నిర్మించనున్నారు. అయితే ఇంటి మార్పుకు వాస్తు కూడా ఒక కారణం అయి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతొంది. బాబు మూడోసారి సీఎం పీఠం ఎక్కిన తరవాత వాస్తుకు ప్రాధాన్యం ఇచ్చి రూ.కోట్లు వెచ్చించి సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్, క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తున్న లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లలో అనేక మార్పుచేర్పులు చేసిన విషయం తెలిసిందే.