వైరల్‌ వీడియో : హీరోయిన్స్‌కు ధీటుగా.. | Young Man Dancing To Dilbar Dilbar Song Video Viral | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 8 2018 5:24 PM | Last Updated on Thu, Nov 8 2018 5:57 PM

Young Man Dancing To  Dilbar Dilbar Song Video Viral - Sakshi

సుస్మీతా సేన్‌, సంజయ్‌ కపూర్‌లు జంటగా వచ్చిన ‘సిర్ఫ్‌ తుమ్‌’ సినిమాలోని ‘దిల్‌బర్‌.. దిల్‌బర్‌’ పాట గుర్తుందా..? అప్పట్లో ఈ సాంగ్‌ ఓ సెన్షేషన్‌ని క్రియేట్‌ చేసింది. ఈ మధ్య కాలంలో జాన్‌ అబ్రహాం హీరోగా వచ్చిన ‘సత్యమేవ జయతే’లో కూడా ఈ పాటను రిమేక్‌ చేశారు. నోరా ఫతేహీ బెల్లీ స్టేప్పులతో ఈ పాటకు మరోసారి క్రేజ్‌ పెంచేశారు. కానీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఓ డ్యాన్సర్‌ సుస్మీతా సేన్‌కి, నోరాకు గట్టి పోటీ ఇస్తున్నాడు. బెల్లీ మూవ్‌మెంట్‌లో నోరానే కాదు ఐటమ్‌ గర్ల్స్‌ అందరూ తన ముందు దిగదుడుపే అంటున్నాడు ఈ కాలేజీ యువకుడు.

‘దిల్‌బర్‌’ సాంగ్‌కు ఈ అబ్బాయి వేసిన స్టేప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ యువకుడి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మీరు ఓ సారి ఈ వీడియో చూడండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement