న్యూఢిల్లీ: ఆమ్ల(యాసిడ్) దాడులకు గురైన బాధితులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించడంతోపాటు ఉచిత వైద్యం కూడా చేయించాలని భారత ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. గతంలో యాసిడ్ ఘటనలపై సీరియస్గా స్పందించిన సుప్రీంకోర్టు దానికి కొనసాగింపుగా నేడు తాజాగా మరోసారి గుర్తుచేసింది. బిహార్ కు చెందిన ఓ యాసిడ్ బాధితురాలి కేసు జస్టిస్ ఎంవై ఇక్బాల్, జస్టిస్ సీ నాగప్పన్తో కూడిన ధర్మాసనం ఈ సూచనలు చేసింది.
యాసిడ్ దాడికి గురైన తనకు ఎవరూ అండగా నిలవలేదని, వైద్యం కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో తాను ఉన్నానంటూ బిహార్ చెందిన ఓ బాధితురాలు సుప్రీంకోర్టు మెట్లెక్కగా కోర్టు ఆమెకు అండగా నిలిచింది. బిహార్ ప్రభుత్వం వెంటనే ఆమెకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించడమే కాకుండా పునరావాసం కల్పించి ఉచిత వైద్యం అందించాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రులకు కూడా ఇలాంటి కేసుల విషయంలో సీరియస్గా వేగంగా స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయాలని కూడా కోర్టు పేర్కొంది.
'యాసిడ్ బాధితులకు ఉచితంగా చికిత్స చేయండి'
Published Mon, Dec 7 2015 4:35 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
Advertisement
Advertisement