యువతిని తుపాకీతో బెదిరించి.. బిహార్ లో దారుణం! | 21 year old Raped at Gunpoint, Pistol Inserted in Her Private Parts | Sakshi
Sakshi News home page

యువతిని తుపాకీతో బెదిరించి.. బిహార్ లో దారుణం!

Published Thu, Jun 23 2016 5:11 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

యువతిని తుపాకీతో బెదిరించి.. బిహార్ లో దారుణం! - Sakshi

యువతిని తుపాకీతో బెదిరించి.. బిహార్ లో దారుణం!

పట్నా: బిహార్ లో మరో దారుణం చోటుచేసుకుంది. 21 ఏళ్ల యువతిని తుపాకీ బెదిరించి దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యంత కిరాతకంగా ఆమె ప్రైవేటు అంగాల్లో పిస్టోల్, చెక్కముక్కలను దూర్చారు. ఈ దారుణంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

మోతిహరి జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. ప్రధాన నిందితుడు సమీవుల్లా గతంలో బాధితురాలిపై అత్యాచారం జరిపి.. ఆ ఘటనను వీడియో తీశాడు. ఆ వీడియోను చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు అతడు ప్రయత్నించాడు. దీంతో అతనిపై బ్లేడుతో బాధితురాలు దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు ఆమెపై కిరాతకంగా అత్యాచారం జరిపాడు. ‘అతడు నన్ను కొట్టి అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత అతని కుటుంబసభ్యులు కూడా నాపై లైంగిక దాడి చేశారు’ అని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని, తాము పేదవాళ్లం కావడంతో కేసు వాపసు తీసుకోవాలని నిందితుడి కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి తండ్రి తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement