Motihari
-
బిహార్‌లో కూలిన మూడో వంతెన
మోతీహారి: బిహార్‌లో వంతెనలు వరుసగా కూలిపోతున్నాయి. ఇప్పటికే రెండు బ్రిడ్జిలు కూలిపోగా, తాజాగా ఆదివారం తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహారిలోని ఘోరాసహన్ బ్లాక్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన మరొకటి కూలిపోయింది. కాలువపై నిర్మిస్తున్న ఈ వంతెన అమ్వా గ్రామాన్ని బ్లాక్‌లోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. 16 మీటర్ల పొడవైన వంతెనను రూరల్ వర్క్స్ విభాగం రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. ఘటనపై విచారణకు ఆదేశించామని, అయితే కారణాలేమీ తెలియ రాలేదని ప్రభుత్వ అదనపు కార్యదర్శి దీపక్ కుమార్ సింగ్ తెలిపారు. -
Bihar: కల్తీ మద్యంతో 20 మంది మృతి!
పాట్నా: బిహార్‌లో మరోసారి కల్తీ మద్యం కాటేసింది. మోతిహారీ జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి మద్యం సేవించిన కొందరి పరిస్థితి విషమించింది. ఇప్పటివరకు 20 మంది మరణించగా.. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం 2016లోనే మద్యపాన నిషేధం విధించింది. అయినప్పటికీ కల్తీ మద్యాన్ని జోరుగా విక్రయిస్తున్నారు. ఇది తాగి అమాయకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజా ఘటనపై సీఎం నితీశ్ స్పందించారు. ఘటన బాధాకరమన్న ఆయన.. విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో కూడా సివాన్‌లో కల్తీమద్యం సేవించి నలుగురు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి అక్రమంగా ఆల్కహాల్ విక్రయించిన 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. లిక్కర్ మాఫియా.. శానిటైజర్ తయారు చేస్తామని చెప్పి కోల్‌కతా నుంచి ఇథేనాల్ తీసుకొచ్చి మద్యం తయారు చేస్తోందని పోలీసులు తెలిపారు. దీన్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎక్సైజ్ శాఖ 15 మంది లిక్కర్ వ్యాపారులను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతేడాది బిహార్‌లోని ఛప్రా జిల్లాలో కల్తీ మద్యం కారణంగా ఏకంగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్లాక్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. కాగా.. కల్తీమద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించే ప్రసక్తే లేదని సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. తాగితే చస్తారని, మద్యం జోలికి వెళ్లొద్దని కరాకండీగా చెప్పారు. చదవండి: అసద్ అంత్యక్రియలు పూర్తి.. తండ్రి అతిఖ్ అహ్మద్‌కు అనుమతి నిరాకరణ -
యువతిని తుపాకీతో బెదిరించి.. బిహార్ లో దారుణం!
పట్నా: బిహార్ లో మరో దారుణం చోటుచేసుకుంది. 21 ఏళ్ల యువతిని తుపాకీ బెదిరించి దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యంత కిరాతకంగా ఆమె ప్రైవేటు అంగాల్లో పిస్టోల్, చెక్కముక్కలను దూర్చారు. ఈ దారుణంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మోతిహరి జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. ప్రధాన నిందితుడు సమీవుల్లా గతంలో బాధితురాలిపై అత్యాచారం జరిపి.. ఆ ఘటనను వీడియో తీశాడు. ఆ వీడియోను చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు అతడు ప్రయత్నించాడు. దీంతో అతనిపై బ్లేడుతో బాధితురాలు దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు ఆమెపై కిరాతకంగా అత్యాచారం జరిపాడు. ‘అతడు నన్ను కొట్టి అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత అతని కుటుంబసభ్యులు కూడా నాపై లైంగిక దాడి చేశారు’ అని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని, తాము పేదవాళ్లం కావడంతో కేసు వాపసు తీసుకోవాలని నిందితుడి కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి తండ్రి తెలిపాడు.