
మోతీహారి: బిహార్‌లో వంతెనలు వరుసగా కూలిపోతున్నాయి. ఇప్పటికే రెండు బ్రిడ్జిలు కూలిపోగా, తాజాగా ఆదివారం తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహారిలోని ఘోరాసహన్ బ్లాక్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన మరొకటి కూలిపోయింది.
కాలువపై నిర్మిస్తున్న ఈ వంతెన అమ్వా గ్రామాన్ని బ్లాక్‌లోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. 16 మీటర్ల పొడవైన వంతెనను రూరల్ వర్క్స్ విభాగం రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. ఘటనపై విచారణకు ఆదేశించామని, అయితే కారణాలేమీ తెలియ రాలేదని ప్రభుత్వ అదనపు కార్యదర్శి దీపక్ కుమార్ సింగ్ తెలిపారు.