Champaran
-
బిహార్‌లో కూలిన మూడో వంతెన
మోతీహారి: బిహార్‌లో వంతెనలు వరుసగా కూలిపోతున్నాయి. ఇప్పటికే రెండు బ్రిడ్జిలు కూలిపోగా, తాజాగా ఆదివారం తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహారిలోని ఘోరాసహన్ బ్లాక్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన మరొకటి కూలిపోయింది. కాలువపై నిర్మిస్తున్న ఈ వంతెన అమ్వా గ్రామాన్ని బ్లాక్‌లోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. 16 మీటర్ల పొడవైన వంతెనను రూరల్ వర్క్స్ విభాగం రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. ఘటనపై విచారణకు ఆదేశించామని, అయితే కారణాలేమీ తెలియ రాలేదని ప్రభుత్వ అదనపు కార్యదర్శి దీపక్ కుమార్ సింగ్ తెలిపారు. -
లోక్‌సభ అభ్యర్థికి పాలాభిషేకం!
బీహార్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ పశ్చిమ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో ఆయన ఆ ప్రాంతంలో విరివిగా పర్యటిస్తూ, ప్రజల మద్దతు కోరుతున్నారు. ఈ నేపధ్యంలో మనీష్ కశ్యప్‌కు కొందరు మహిళలు పాలాభిషేకం చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య ఒక కేసులో చిక్కుకుని,ఇటీవలే జైలు నుంచి విడుదలైన మనీష్ కశ్యప్ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. కొత్త బీహార్‌ను సృష్టించడానికే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మనీష్ చెబుతున్నారు. తూర్పు చంపారన్ జిల్లా బంజరియా బ్లాక్‌లోని రతన్‌పూర్ గ్రామానికి మనీష్ కశ్యప్ ప్రచారానికి వచ్చిన సందర్భంగా అక్కడి మహిళలు అతనికి పాలాభిషేకం చేశారు. మనీష్ కశ్యప్ ఎన్నికల పర్యటనలో ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మనీష్ కశ్యప్‌ను చూసేందుకు జనం తరలివస్తున్నారు. -
సరదా సన్నివేశం.. రాహుల్‌కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ
పాట్నా: బిహార్‌లో ప్రసిద్ధి చెందిన 'చంపారన్ మటన్' ను ఏవిధంగా వండించాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లాలూ ప్రసాద్ యాదవ్ నేర్పించారు. లాలూ సూచనలు ఇస్తుండగా.. రాహుల్ మటన్ కర్రీని వండారు. ఈ వీడియోను రాహల్ తన ట్విట్టర్(ఎక్స్) లో షేర్ చేశారు. 'నాకు వంట చేయడం వచ్చు. కానీ పూర్తి నైపుణ్యం లేదు. యూరప్‌లో ఉండేప్పుడు ఒంటరిగా ఉండేవాన్ని. ఆ క్రమంలో వండటం నేర్చుకున్నాను. కొన్ని ప్రాథమిక వంటలు చేస్తాను.' అని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తెలుపుతూ.. నేడు లాలూ యాదవ్ నేతృత్వంలో మంచి వంటకాన్ని వండాను అని రాసుకొచ్చారు. మటన్ వండే క్రమంలో నేతలిద్దరు ముచ్చటించుకున్నారు. వంట వండటం ఎప్పుడు నేర్చుకున్నారని రాహుల్ అడిగిన ప్రశ్నకు లాలూ సమాధానమిచ్చారు. ' 7వ తరగతి చదివే క్రమంలో నేను అన్నయ్యల వద్దకు పాట్నా వెళ్లాను. అక్కడ వారు ఉద్యోగం చేసేవారు. అక్కడే వారికి వండిపెట్టేవాడిని. కట్టెలు ఎలా సమకూర్చుకోవాలి..? వంట పాత్రలు ఎలా శుభ్రపరుచుకోవాలి..? మసాలాలు ఎలా రుబ్బుకోవాలో? నేర్చుకున్నాను.' అని లాలూ చెప్పారు. ఏడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో లాలూ.. రాహల్‌కు మటన్ ఎలా చేయాలో నేర్పించారు. మసాలాలతో సహా అన్ని రకాలను ఎలా కలపాలో చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రాజకీయాలపై ఆసక్తికర ప్రశ్నోత్తరాల చర్చ సాగింది. రాహుల్: రాజకీయాల్లో సీక్రెట్ మసాలాలు ఎంటి? లాలూ: కష్టపడి పనిచేయడమే, అన్నాయానికి వ్యతిరేకంగా పోరాడాలి. రాహుల్: మటన్ కర్రీని తయారు చేయడం.. రాజకీయాలు రెండింటి మధ్య తేడా ఏంటి? నాకు అన్ని కలపడం ఇష్టం.. లాలూ: అవును, కొంచమైనా కలపకుండా రాజకీయాలు చేయలేం. నాకూ రాజకీయం అంటే ఇష్టం. రాహుల్: మాలాంటి వచ్చే తరానికి మీరిచ్చే సలహా ఏంటీ? లాలూ: మీ పూర్వికులు ఈ దేశాన్ని కొత్త మార్గంలో నడిపించారు. ధర్మాన్ని కాపాడారు. మీరు దాన్ని మరిచిపోకూడదు. మటన్ కర్రీ తయారు చేసేప్పుడు బిహార్ డిప్యూటీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరి మిసా భారతి అక్కడే ఉన్నారు. వంట పూర్తి అయిన తర్వాత డైనింగ్ టేబుల్ వద్దకు అందరూ రావడాన్ని గమనించవచ్చు. ఆ తర్వాత రాహుల్ ఆ మటన్ కర్రీని తన సోదరి ప్రియాంకకు కూడా ప్యాక్ చేసుకుని తీసుకువెళ్లారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
మనుషుల రక్తానికి రుచి మరిగింది.. 9 మందిని చంపి చివరకు ఇలా..
మనుషుల రక్తానికి రుచిమరిగిన ఓ పులి ఏకంగా తొమ్మిది మందిని దారుణంగా చంపింది. గ్రామస్తులపై ఎగబడి పంజా విసురుతూ ప్రతాపం చూపించింది. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చంపారన్ జిల్లాలోని బగాహ అనే గ్రామంపై పులి దాడి చేస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇలా ఇప్పటివరకు 9 మందిని కిరాతకంగా దాడి చేసి చంపింది. EXCLUSIVE: Man-eating tiger killed in Bihar's West Champaran. The tiger was killed after 5 hours of hard work. Till now, the tiger had killed 9 people 🙂#bihar #tiger , pic.twitter.com/oBL3aj8dFR — विनीत ठाकुर (@yep_vineet) October 8, 2022 దీంతో, స్థానికుల ఫిర్యాదు మేరకు కొన్నివారాల నుంచి పులిని బంధించేందుకు ఏనుగులతో గాలించినా జాడ కనిపించలేదని అటవీ సిబ్బంది తెలిపారు. ఇక, మూడు రోజుల వ్యవధిలోనే నలుగురిని చంపినట్లు చెప్పారు. దీంతో, బీహార్ ప్రభుత్వం అనుమతి తీసుకొని షార్ప్ షూటర్లతో పులిని చంపినట్లు అటవీ సిబ్బంది వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. A man-eating tiger, which mauled 11 people to death in Bihar in past one month, was shot dead in Valmiki Tiger Reserve (VTR) on Saturday morning.#ValmikiTigerReserve #VTR #Tiger #ManEater #ManEatingTiger #TigerKing #Viral #ViralVideos #viral2022 #India pic.twitter.com/KNH28h3skU — Anjali Choudhury (@AnjaliC16408461) October 8, 2022 बिहार में मारा गया आदमखोर बाघ, 7 घंटे के ऑपरेशन के बाद हुआ टाइगर के आतंक का अंत ।#Bihar #Bagaha #Tiger #ValmikiTigerReserve pic.twitter.com/qdi2l4F90O — Mayank makkar (@Mayankmakkar6) October 8, 2022 -
చంపారన్ వారియర్లు
గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు వచ్చాక, భారతదేశ పర్యటన ప్రారంభించారు. దానిలో భాగంగా చంపారన్ నీలి రైతులను దర్శించి వారికి పరిష్కారాన్ని చూపించారు. చంపారన్.. రాజర్షి జనకుని భూమి. చంపారన్‌లో మామిడి తోటలు వున్నట్లే, నీలిమందునూ ఉత్పత్తి చేస్తూ ఉండేవారు. బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం రావడం వల్ల బ్రిటన్ వారికి నీలిమందు అవసరం పడింది. చంపారన్ రైతులు తమ భూమిలో 3/20 వంతు భాగంలో తప్పనిసరిగా తమ తెల్ల యజమాని కోసం నీలిమందును చట్టరీత్యా ఉత్పత్తి చేయవలసి వచ్చేది. దీన్ని ‘తీన్ కఠియా రివాజు’ అని పిలిచేవారు. ఈ విషయంలో నీలి రైతులు తమ బాధలను గాంధీజీకి స్వయంగా విన్నవించుకున్నారు. రివాజుపై పోరాటం రాజ్ కుమార్ శుక్లా బీహార్‌లోని చంపారన్‌కు చెందిన రైతు. ఆయన తీన్ కఠియా వల్ల బాధలు పడ్డాడు. ఆ నీలిమచ్చను రైతులందరి హృదయాల నుండి తొలగించి వేయాలనే అగ్ని అతని హృదయంలో రగుల్కొంది. లక్నో కాంగ్రెసు మీటింVŠ లో గాంధీజీని కలుసుకుని చంపారన్ కథ వినిపించాడు. కానీ గాంధీజీ తాను స్వయంగా చూస్తే గానీ నమ్మరు కాబట్టి ఆయన చంపారన్ వెళ్లారు. ‘‘అణగారి పోయి భయభ్రాంతులై వున్న రైతు సోదరుల్ని కచేరీలు చుట్టూ తిప్పితే లాభం లేదు, అది సరైన చికిత్స కాదు, వాళ్లలో భయాన్ని పోగొట్టాలి’’ అని గాంధీజీ అక్కడి న్యాయవాదులను సున్నితంగా మందలించారు. ‘తీన్ కఠియా రద్దు కావాలి, అప్పటి వరకూ మనం విశ్రమించకూడదు’ అని కూడా అన్నారు గాంధీజీ. గాంధీజీకి నోటీసులు చంపారన్ బీహార్‌లో గంగానదికి ఆవలి వడ్డున, హిమాలయ పర్వత చరియల్లో నేపాల్‌కు దగ్గరగా వున్న ప్రాంతం. పరిపాలనా పరంగా చంపారన్ తిరుహాత్ కమీషన్‌లోని ఒక జిల్లా. దానికి ‘మోతీహార్‘ ప్రధాన కేంద్రం. అక్కడి నీలి మందు రైతులు నిరుపేదలు. ఆ ప్రాంతంలోనే బేతియాకు దగ్గర్లో రాజ్ కుమార్ శుక్లా ఇల్లు వుంది. ఆ దగ్గర్లోనే కస్తూరిబా గాంధీ ‘బితిహారమా’ గ్రామంలో పాఠశాలను నడపడం మొదలుపెట్టారు. ఈ దంపతుల ప్రోద్బలంతో ఆ ప్రాంత రైతులు తిరగబడతారేమోననే భయంతో ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. ‘మీరు సెక్షన్ 144ను ఉల్లంఘించారు గనుక రేపు కోర్టుకు హాజరు కమ్మని’ గాంధీజీకి సమన్లు పంపారు జిల్లా అధికారులు. గాంధీజీ ఎవరో తెలియకపోయినా చంపారన్‌లో ప్రజలు వార్త విని తండోప తండాలుగా కోర్టు ఆవరణ లోనికి వచ్చారు. పోలీసులకు వారిని అదుపు చేయడం కష్టమయ్యింది. గాంధీజీ ‘నా అపరాధమును అంగీకరిస్తున్నాను‘ అన్నారు మెజిస్ట్రేట్‌తో. ‘ నాకిచ్చిన ఆదేశాన్ని పాటిస్తే నేను ప్రజలకు న్యాయం చేయలేను, అందుకే చంపారన్ విడిచి వెళ్లలేను’ అని కూడా అన్నారు గాంధీజీ. అదే విషయాన్ని భారత వైస్రాయ్కూ ఇతర ఉన్నత అధికారులకూ, శ్రీ మదన మోహన మాలవ్యకూ తంతి ద్వారా తెలియజేసారు గాంధీజీ. చివరికి ‘తీన్ కఠియా రివాజు’ రద్దయింది. తీన్ కఠియా రద్దుకు పోరాడుతున్న సమయంలోనే.. చంపారన్ గ్రామాల్లో విద్యా, వైద్య ప్రచారం జరిగితే గానీ ఆ గ్రామాలు బాగుపడవనే నిర్దారణకు గాంధీజీ వచ్చారు. పిల్లలు చదువులు లేకుండా తిరుగుతుండేవారు. పురుషులకు కూలి పది పైసలు, స్త్రీలకు ఆరు పైసలు, పిల్లలకు మూడు పైసలు. సహచరులతో చర్చించి మొదట ఆరు గ్రామాల్లో పాఠశాలలు నెలకొల్పారు. ఉపాధ్యాయుల విషయంలో వారికి చదువు రాకపోయినా పరవాలేదు కానీ శీలవంతులై వుండాలని గాంధీజీ గట్టిగా చెప్పారు. వాలంటీర్లకు పిలుపు గాంధీజీ స్కూలు నడపడానికి వాలంటీర్లు కావాలని ప్రకటించారు. ఆ ప్రకటనకు స్పందించి బాబా సాహెబ్ సామణ్, పుండలీక, అవంతికా బాయి గోఖలే, దక్షిణాది నుండి ఆనందీ బాయి, మహాదేవ్ దేశాయ్ భార్య దుర్గాబెన్, నరహరి ఫరేఖ్ భార్య మణి బెన్, కస్తూరి బాయి, దేవదాసు గాంధీ లు ఉపాధ్యాయులుగా వచ్చి చేరారు. మొదటి తరగతిలో అంకెలు నేర్పమని, నడవడిక నేర్పమని, రాయడం, చదవడం కంటే వారికి పారిశుద్ధ్యం గురించి చెప్పాలని గాంధీజీ ‘పాఠ్యాంశాన్ని’ నిర్థారించారు. గాంధీజీ కి చదువుతో తృప్తి కలగలేదు. గ్రామాల్లో మురికి అధికంగా వుంది, గ్రామం వీధుల్లో పెంటకుప్పలూ, బావుల దగ్గర బురద, దుర్వాసన, ఇళ్ల ముందు భరించలేని పరిస్థితులు వున్నాయి. పెద్దలు కూడా పారిశుద్ధ్యాన్ని గరపడం అవసరమని భావించారు. చంపారన్ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు, ఇందుకు డాక్టర్ సహాయం అవసరం కాబట్టి గోఖలే సొసైటీ కి చెందిన డాక్టర్ దేవ్ ను రప్పించారు. డా. దేవ్ రోగుల్ని చూడటమే కాదు, మిగతా వాలంటీర్లతో కలసి ఒక గ్రామం వీధులు శుభ్రం చేశారు. పెంట కుప్పలు ఎత్తివేశారు. బావి దగ్గర గల గుంతల్ని మట్టితో పూడ్చారు, పారిశుధ్యం ఈ విధంగా కొనసాగితే పెద్ద పెద్ద డాక్టర్లు అవసరం పడదని బోధించారు. కస్తూర్బాతో చెప్పించారు బీతిహరుమాలో స్త్రీల బట్టలు చాలా మురికిగా వున్నాయి. ఆ మహిళల్ని బట్టలు ఉతుక్కోమని, బట్టలు మార్చుకోమని చెప్పమని కస్తూరిబా తో చెప్పించారు గాంధిజీ. బట్టలు లేనివాళ్లకు బట్టలు తెప్పించారు. ఆ విధంగా గాంధీజీ దంపతులు చంపారన్‌లో వారియర్లై చైతన్యం తేగలిగారు. – కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యులు -
పండుగ పూట విషాదం: కల్తీ మద్యం తాగి 24 మంది మృతి
పట్నా: బిహార్‌లో దీపావళి పండుగ వేడుకలలో విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ చంపారన్ ప్రాంతంలోని.. తెల్హువా గ్రామంలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 24కి పెరిగింది. బాధితులంతా.. బుధవారం స్థానికంగా ఉన్న.. ఒక దుకాణంలో.. మద్యంసేవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో వీరిలో కొంత మంది ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇప్పటికే.. ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా, మరో 16 మంది ఆసుపత్రిలో చికిత్సపోందుతూ మృత్యువాత పడ్డారు. ఆసుపత్రిలో మరికొందరిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై బిహార్ సీఎం నితిష్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానికి మంత్రులు, ఎమ్మెల్యేలు బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో 20 మందిపై అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స్థానిక పోలీసు అధికారులు పేర్కొన్నారు. -
బిహార్: నలుగురు మావోయిస్టుల హతం
పట్నా : బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. బిహార్ పోలీసులతో పాటు శస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్) సంయుక్తంగా ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ఎస్టిఎఫ్ బృందానికి పోలీసు సూపరింటెండెంట్ ధరేంద్ర నాయకత్వం వహించారని పేర్కొన్నారు. అయితే దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో కొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. (వికాస్ దూబే ఎన్కౌంటర్: అనేక అనుమానాలు!) ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే చనిపోగా, ఓ పోలీసు అధికారికి తీవ్రగాయాలపాలైనట్లు సమాచారం. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వివరించారు. మావోయిస్టుల నుంచి అధునాతన ఆయుధాలు, ఏకె-56, ఎస్ఎల్ఆర్ సహా మూడు రెఫిల్లను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ సుంజయ్ కుమార్ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పిన ఐజీ.. చనిపోయిన మావోయిస్టుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. (గ్యాంగస్‌స్టర్ మరణంతో గ్రామంలో సంబరాలు) -
రాహుల్ ర్యాలీలో గన్ కలకలం
-
రాహుల్ ర్యాలీలో గన్ కలకలం
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం పాల్గోనున్న ర్యాలీలో గన్ కలకలం సృష్టించింది. బీహార్‌లోని చంపారన్‌లో రాహుల్ గాంధీ తలపెట్టిన భారీ ర్యాలీలోకి ఓ వ్యక్తి గన్‌తో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ర్యాలీ ప్రవేశ ద్వారం దగ్గర ఆ వ్యక్తిని పోలీసులు తనిఖీ చేస్తుండగా అతని దగ్గర గన్ను గుర్తించారు. ఆ వ్యక్తిని పశ్చిమ చంపారన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.