న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఈవ్ టీజింగ్ను అడ్డుకున్న ఓ యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. దాదాపు 35 సార్లు ఆమెను కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. ఢిల్లీలోని ఆనంద్ పర్బాత్ ఏరియాలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొంతకాలంగా ఓ ఇద్దరు సోదరులు పందోమ్మిదేళ్ల యువతిని ర్యాగింగ్ చేస్తూ వచ్చారు. ఆమె ప్రతిఘటించిన ప్రతిసారి అసభ్యకరంగా ప్రవర్తించారు. కాగా, గురువారం సాయంత్రం మార్కెట్కు వెళ్లిన యువతిని ఫాలో అయిన ఆ ఇద్దరు ముందు టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారు.
ఆమె వారి నుంచి తప్పించుకోని కొంచెం ముందుకు పరుగెత్తగా వెంటపడి మరీ బందించి మొత్తం 35 సార్లుకుపైగా కసాయివారిలా మారిపోయి కత్తితో పొడిచేశారు. దీంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి పోయింది. అయినప్పటికీ వారు విడిచిపెట్టకుండా మరోసారి హింసించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని అక్కడి ప్రత్యక్ష సాక్షులే తెలిపారు. గతంలో ఆ యువతి వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కానీ, పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదని, పెడచెవిన పెట్టడం వల్లే తమ బిడ్డ బలైందని తల్లిదండ్రులు, బంధువులు రోధిస్తున్నారు. నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు.
టీజింగ్ అడ్డుకుందని 35సార్లు పొడిచారు
Published Fri, Jul 17 2015 6:39 PM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM
Advertisement
Advertisement