పాల్ఘర్: భూతగాదా నేపధ్యంలో పాలఘర్ లో 45 ఏళ్ల మహిళపై ఐదారుగురు వ్యక్తులు దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆమెను వివస్త్రను చేసి హింసించి, లైంగికంగా వేధించి, దారుణంగా కొట్టారు. దాడికి పాల్పడినవారిలో నరేశ్ దోడి అనే కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బోయిసర్ అనే మండలంలోని దాండి పాడా అనే గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళకు కొంత భూమి ఉంది.
దీనిని డెవలప్ మెంట్ కు ఇవ్వాల్సిందిగా నరేశ్ దోడీ అడగగా అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను జుట్టుపట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చి రోడ్డుపైనే అందరు చూస్తుండగా చిత్రహింసలు పెట్టారు. కర్రలతో బాదారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, ఆమె ఆరు నెలల కిందటే ఆ భూమిని నరేశ్ దోడీ నుంచి కొనుగోలు చేయగా దానిని తనకే అభివృద్ధి చేసేందుకు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తున్నాడట.
భూమికోసం వివస్త్రను చేసి మహిళపై దాడి
Published Thu, May 21 2015 2:48 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement
Advertisement