Crime News Delhi In Telugu: Lover Killed Girlfriend In Hotel Room After Argument - Sakshi
Sakshi News home page

హోటల్‌ గదిలో ఏకాంతంగా లవర్స్‌.. ఇంతలో ఫోన్‌ కాల్‌.. చివరకు..

Published Wed, Mar 2 2022 1:44 PM | Last Updated on Wed, Mar 2 2022 4:16 PM

Lover Kills Girlfriend Inside Hotel Room After Argument - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: వాళ్లు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ. ఇంతతో ఓ ఫోన్‌ కాల్‌ వారిద్దరి మధ్య చిచ్చుపెట్టింది. దీంతో హోటల్‌ రూమ్‌లో వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగి దారుణం జరిగింది. ఈ ఘర్షణలో ఆమె ప్రాణాలు కోల్పోవ్సాలి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన శివమ్‌ చౌహాన్‌(28), ఢిల్లీలోని కిశన్‌గఢ్‌కు చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఏకంతంగా కలుసుకునేందుకు ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలోని ఓ హెటల్‌కు వచ్చారు. ఈ క్రమంలో వారు హోటల్‌ రూమ్‌లో ఉండగా.. ఆమెకు ఓ వ్యక్తి వరుసగా కాల్స్‌ చేశాడు. దీంతో శివమ్‌.. ఎవరూ అని ప్రశ్నించగా తన సోదరి ప్రియుడు అని చెప్పింది. ఆమె మాటలు నమ్మని చౌహాన్‌.. మళ్లీ ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆవేశంతో శివమ్‌.. ఆమె తలను నెలకేసి కొట్టడంతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. 

ఇదిలా ఉండగా మరుసటి రోజు చౌహాన్‌ ఒక్కడే రూమ్‌ నుండి బయటకు వెళ్లిపోగా.. డెడ్‌ బాడీని గుర్తించిన హెటల్‌ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఆధారంగా శివమ్‌ను పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు విచారించగా.. తన ప్రియురాలు తనను మోసం చేసి ఉత్కర్ష్‌ అనే మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్టు చెప్పాడు. అందుకే తాను ఆమెను హత్య చేసినట్టు తెలిపాడని డీసీపీ గౌరవ్‌ శర్మ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement