ఆమె పొలిటికల్ మైలేజ్ కోసమే.. | Delhi: Accused in Tilak Nagar eve-teasing case slams girl, calls her an AAP supporter | Sakshi
Sakshi News home page

ఆమె పొలిటికల్ మైలేజ్ కోసమే..

Published Tue, Aug 25 2015 6:07 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఆమె పొలిటికల్ మైలేజ్ కోసమే.. - Sakshi

ఆమె పొలిటికల్ మైలేజ్ కోసమే..

న్యూఢిల్లీ: తనకు రాజకీయ ప్రయోజనం లభిస్తుందనే ఉద్దేశంతోనే ఆ అమ్మాయి తనపై అనవసరంగా ఫిర్యాదు చేసిందని ఢిల్లీలో ఓ యువతిపై వేధింపులకు పాల్పడి అరెస్టయిన సన్నీ అనే యువకుడు ఆరోపించాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువతిపట్ల వెకిలి చేష్టలు ప్రవర్తిస్తూ, అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే.

అతడి ఫొటోను తీసి ఆమె ట్విట్టర్లో పెట్టి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం సాయంత్రం అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వెంటనే అతడు బెయిల్పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో ఓ మీడియా అతడిని సంప్రదించగా ఆ యువతి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారు అని, తన రాజకీయ భవిష్యత్ కోసం తనపై లేనిపోని ఆరోపణలు చేసి కేసు పెట్టిందని ఆరోపించాడు. మరోపక్క, ఆమెకున్న రాజకీయ అవకాశాలను ఆ యువతి తప్పుగా ఉపయోగించుకుంటోందని నిందితుడి తల్లి ఆరోపించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement