'కంప్లెయింట్ ఇచ్చి చూడు.. తర్వాత తెలుస్తుంది'
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళలపై ఆగడాలు ఎక్కువవుతున్నాయి. దినదినం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు ఒక ప్రదేశమంటూ మినహాయింపు లేని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో బైక్పై వెళుతున్న ఓ వ్యక్తి మహిళపట్ల అసభ్యంగా వ్యవహరించాడు. ఆమెను వేధింపులకు గురిచేయడమే కాకుండా అనకూడని మాటలు అన్నాడు. ఆ వ్యక్తిని ఫొటో తీసేందుకు ఆమహిళ ప్రవర్తిస్తుండగా ఫొటో తీస్కోని నీ దిక్కున్న చోట చెప్పుకోపో అన్నంతగా హెచ్చరించాడు. దీంతో అతడిని తన ఫోన్లో ఫొటో తీసిన ఆ మహిళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
'రాత్రి 8.30గంటల ప్రాంతంలో నేను తిలక్ నగర్ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు సిద్ధమయ్యాను. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ అతడు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. భయ్యా రెడ్ సిగ్నల్ పడింది కదా ఆగొచ్చు కదా అని ఆమహిళ సూచించగా నాతో రా నేను నిన్ను జనక్ పురి వద్ద డ్రాప్ చేస్తాను అని అన్నాడు. ఫొటో తీస్కో.. కంప్లెయిట్ ఇచ్చి చూడు.. మరోసారి కలిసినప్పుడు ఏమవుతుందో తెలుస్తుంది అంటూ హెచ్చరించాడు' అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన పేర్కొంది. వేధింపులకు దిగిన ఓ వ్యక్తి ముందు ధైర్యంగా నిల్చుని అతడి ఫొటోని తీస్కోని ఫిర్యాదు చేయడం పట్ల పోలీస్ కమిషనర్ ఆమెను కొనియాడారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు.