Tilak Nagar
-
కారు రివర్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తూ..
న్యూఢిల్లీ : బుడిబుడి అడుగులేస్తూ ఆడుకుంటున్న ఆ చిన్నారిని కారు రూపంలో మృత్యువు కబళించింది. అపార్ట్మెంట్ సెల్లార్లో కారు రివర్స్ తీస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని తిలక్ నగర్లో చోటుచేసుకుంది. (దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు) రాధిక అనే 10 నెలల చిన్నారి తన ఇంటి కిందనే ఉన్న పార్కింగ్ స్థలంలో ఆడుకుంటుంది. అదే సమయంలో అఖిలేష్ అనే డ్రైవర్ మెర్సిడిస్ బెంజ్ కారును రివర్స్ తీశాడు. ఈ క్రమంలో కారు వెనక భాగం బాలికను ఢీకొంది. తీవ్రగాయాలైన బాలికను డీడీయూ ఆసుపత్రికి తరలించగా, బాలిక మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కారు యజమాని జస్బీర్ సింగ్‌గా గుర్తించారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (కరోనా ఎఫెక్ట్; వైద్యానికీ ఆధార్!) -
వాట్సాప్‌లో యువతికి వేధింపులు
నల్లకుంట (హైదరాబాద్): వాట్సాప్‌లో ఓ యువతికి అసభ్యకర మెస్సేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్న ఓ వ్యక్తిపై నల్లకుంట పోలీసులు బుధవారం నిర్భయ కేసు నమోదు చేశారు. ఎస్ఐ చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. తిలక్‌నగర్‌లో నివాసముంటున్న ఓ యువతి (23) కి ఓ వ్యక్తి కొంత కాలంగా వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేని ఆ యువతి నల్లకుంట పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు వాట్సాప్ మెస్సేజ్‌లు పంపించిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడి కోసం వేట ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'కంప్లెయింట్ ఇచ్చి చూడు.. తర్వాత తెలుస్తుంది'
-
'కంప్లెయింట్ ఇచ్చి చూడు.. తర్వాత తెలుస్తుంది'
న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళలపై ఆగడాలు ఎక్కువవుతున్నాయి. దినదినం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు ఒక ప్రదేశమంటూ మినహాయింపు లేని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి మహిళపట్ల అసభ్యంగా వ్యవహరించాడు. ఆమెను వేధింపులకు గురిచేయడమే కాకుండా అనకూడని మాటలు అన్నాడు. ఆ వ్యక్తిని ఫొటో తీసేందుకు ఆమహిళ ప్రవర్తిస్తుండగా ఫొటో తీస్కోని నీ దిక్కున్న చోట చెప్పుకోపో అన్నంతగా హెచ్చరించాడు. దీంతో అతడిని తన ఫోన్లో ఫొటో తీసిన ఆ మహిళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. 'రాత్రి 8.30గంటల ప్రాంతంలో నేను తిలక్ నగర్ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు సిద్ధమయ్యాను. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ అతడు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. భయ్యా రెడ్ సిగ్నల్ పడింది కదా ఆగొచ్చు కదా అని ఆమహిళ సూచించగా నాతో రా నేను నిన్ను జనక్ పురి వద్ద డ్రాప్ చేస్తాను అని అన్నాడు. ఫొటో తీస్కో.. కంప్లెయిట్ ఇచ్చి చూడు.. మరోసారి కలిసినప్పుడు ఏమవుతుందో తెలుస్తుంది అంటూ హెచ్చరించాడు' అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన పేర్కొంది. వేధింపులకు దిగిన ఓ వ్యక్తి ముందు ధైర్యంగా నిల్చుని అతడి ఫొటోని తీస్కోని ఫిర్యాదు చేయడం పట్ల పోలీస్ కమిషనర్ ఆమెను కొనియాడారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. -
నాలాలో శవం లభ్యం
కాచిగూడ: హైదరాబాద్ నగరం కాచిగూడ పరిధి రాంనగర్లో నాలాలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్న శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు పొంగి పొర్లుతుండటంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు. -
ఇంట్లో ఉన్న తల్లీకూతుళ్ల హత్య
న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్లో తల్లి(40), కూతురు(18) హత్యకు గురయ్యారు. వారి నివాసంలోనే ఈ హత్యలు జరిగాయి. మృతదేహాలపై తీవ్ర గాయలను బట్టి వారిని చిత్రహింసలకు గురిచేసి హత్యలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యలు బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే హతురాలి కుమారుడు జస్పాల్ తీవ్ర గాయాలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు ఇరుగుపొరుగువారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. జస్పాల్ బయటకు రావడంతో అనుమానంతో ఇరుగుపొరుగువారు ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లో తల్లి జస్పీర్, కుమార్తె ప్రభాజోట్లు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు వీరి ముగ్గురిపై కత్తులతో దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. అయితే వీరి ఇంట్లోకి ఎవరూ దౌర్జన్యంగా చొరబడిన దాఖలాలు లేవని తెలిపారు. నిందితులను గుర్తించేందుకు సమీపంలోని సిసిటివి కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అలాగే ఇరుగుపొరుగువారిని కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.