కాచిగూడ: హైదరాబాద్ నగరం కాచిగూడ పరిధి రాంనగర్లో నాలాలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్న శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు పొంగి పొర్లుతుండటంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు.