
న్యూఢిల్లీ : బుడిబుడి అడుగులేస్తూ ఆడుకుంటున్న ఆ చిన్నారిని కారు రూపంలో మృత్యువు కబళించింది. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో కారు రివర్స్ తీస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని తిలక్ నగర్‌లో చోటుచేసుకుంది. (దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు)
రాధిక అనే 10 నెలల చిన్నారి తన ఇంటి కిందనే ఉన్న పార్కింగ్ స్థలంలో ఆడుకుంటుంది. అదే సమయంలో అఖిలేష్ అనే డ్రైవర్ మెర్సిడిస్ బెంజ్ కారును రివర్స్ తీశాడు. ఈ క్రమంలో కారు వెనక భాగం బాలికను ఢీకొంది. తీవ్రగాయాలైన బాలికను డీడీయూ ఆసుపత్రికి తరలించగా, బాలిక మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కారు యజమాని జస్బీర్ సింగ్‌గా గుర్తించారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (కరోనా ఎఫెక్ట్; వైద్యానికీ ఆధార్!)
Comments
Please login to add a commentAdd a comment